కేజీఎఫ్‌ హీరోతో పూరీజన్నాథ్ సినిమా !

డైనమిక్ డైరెక్టర్ పూరీజన్నాథ్ సినిమా అంటే అభిమానుల్లో క్రేజ్ మరో లెవెల్ ఉంటుంది. హీరోలను మాస్ ఆడియన్స్ కు దగ్గర చేయడం పూరీ స్టైల్. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తానేంటో మరోసారి నిరూపించుకున్న పూరీ. ఇప్పుడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి’ఫైటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ డేరింగ్ డైరెక్టర్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని పూరీ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు.

చివ‌రికిలా.. కేజీఎఫ్ 2 ఫ్యాన్స్ ఆశ‌ల‌పై నీళ్లు

కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న హీరో యష్ తో పూరీ జగన్నాథ్ సినిమా ఉండనుందని. ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో పూరీ, యష్ సినిమా రాబోతుందని ఓ వార్త వినిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాలో రాకీభాయ్‌ గా యష్ తన ప్రతిభను చూపించాడు. అందులో అతడి నటన అద్భుతం. దానికి తోడు దర్శకుడు హీరోను ఎలివేట్ చేసిన తీరు, చూపించిన విధానం సినిమాకు ఊపిరి పోశాయి. కేజీఎఫ్‌ కు వచ్చిన స్పందనను చూసి ఈ సినిమా రెండో భాగాన్ని మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా పార్ట్2 కోసం అభిమానులు కళ్ళుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

అయితే, సౌత్‌ నుంచి పాన్‌ ఇండియన్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న యష్‌ ఇప్పుడు తన నెక్స్ట్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌ పెట్టాడు. యష్‌ హీరోగా పూరి జగన్నాథ్ ఓ సినిమాను ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా పూర్తయ్యాక పూరి జగన్నాథ్‌ యష్‌ తో పాన్‌ ఇండియా సినిమాను చేయాలనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో ఇటీవల యష్‌ను కలిసి స్క్రిప్ట్‌ను వినిపించడం, అది యష్‌కు నచ్చడం చకచకా జరిగిపోయాయట. ఈ మరి ఈ ప్రాజెక్ట్‌ ఎంత వరకు వర్క్‌ అవుట్‌ అవుతుందో చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles