రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్ సెన్సేషన్. వరుస హిట్లతో టాలీవుడ్ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. తక్కువ సమయంలోనే సౌత్ మొత్తంలో పాగా వేశాడు. ఇప్పుడు ఏకంగా ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగేందుకు రెడీ అవుతున్నాడు. మామూలుగా ఈ రౌడీ బాలీవుడ్‌లో నేరుగా ఒక్క సినిమా చేయకపోయినా కూడా బాలీవుడ్ భామల హృదయాలను కొల్లగొట్టేశాడు. ఎంతో మంది హీరోయిన్లకు విజయ్ అంటే క్రష్. డబ్బింగ్ సినిమాలతోనే విజయ్ ఓ రేంజ్‌పాపులార్టీని సంపాదించుకున్నాడు.
అలా వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుని ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం పూరి జగన్నాథ్ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశాడు. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతోన్న ఫైటర్ మూవీపై ఎన్ని అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఓ రొమాంటిక్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసేశారు. ఈ సినిమా కోసం విజయ్ ప్రత్యేక్ష శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. థాయిలాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు.
ఇక ఫైటర్ మూవీ కోసం విజయ్ తన శరీరాకృతిని కూడా మార్చుకుంటున్నాడు. అయితే తాజాగా విజయ్ తన గాయాల గురించి చెప్పాడు. తనకు భుజానికి సంబంధించిన గాయాలున్నాయని, అయినా కూడా పూరి జగన్నాథ్ సినిమా కోసం నా బాడీని మార్చేస్తున్నానని, ఇది వరకు ఎన్నడూ లేని విధంగా బాడీ పెంచుతున్నానని చెప్పాడు. అందుకోసం తన ట్రైనర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నేర్పిస్తున్నాడు అలాంటి అతను ఇప్పుడు కొత్తగా ఫిట్ నెస్ సెంటర్ పెడుతున్నాడని చెప్పుకొచ్చాడు. మొత్తానికి విజయ్ తన భుజాని గాయమైందన్న విషయాన్ని అలా బయటపెట్టేశాడు.