బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఆ చురుకుదనం కలిసి వస్తుంటుంది. ఒక్కోసారి అదే కొంపముంచుతుంది. బండ్ల గణేష్‌కు టెక్నాలజీ గురించి అంతగా తెలియదు. అంతగా ఇంగ్లీష్ కూడా రాదు. ఆ మధ్య ఇదే అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. పవన్ కళ్యాణ్‌ను తిడుతూ వచ్చిన పోస్ట్‌ను బండ్ల గణేష్ పొరబాటును లైక్ చేశాడట. అది ఎలా తీసేయాలో కూడా తెలియలేదట.
ఇక బండ్లన్న చేసే ట్వీట్‌లలో ఎక్కువ శాతం స్పెల్లింగ్ మిస్టేక్‌లుంటాయి. వాటిని నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తుంటారు. తాజాగా బండ్ల గణేష్ ఓ ట్వీట్ వేశాడు. మళ్లీ వెంటనే సర్దుకున్నాడు. తాను వేసిన ట్వీట్‌లో తప్పుందని వెంటనే క్షణాల్లో పసిగట్టేసి.. దాన్ని డిలీట్ చేసి కొత్త ట్వీట్ వేశాడు. అసలు బండ్ల గణేష్ ఎందుకు ట్వీట్ వేశాడు.. ఏం వేశాడు.. డిలీట్ చేసి మళ్లీ ఏం ట్వీట్ వేశాడన్నది చూద్దాం.
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడనే రూమర్లు వచ్చాయి. వాటిపై బండ్ల గణేష్ స్పందించాడు. మొదటి ట్వీట్‌లో రూమర్స్ అని రాయబోయి రొమాన్స్ అని రాసేశాడు. అది తప్పని తెలుసుకుని వెంటనే డిలీట్ చేశాడు. మళ్లీ సరైన ట్వీట్ వేస్తూ.. తన బ్యానర్‌లో ఏదైనా ప్రాజెక్ట్ ఓకే అయితే తానే స్వయంగా ప్రకటిస్తానని చేతులెత్తి దండం పెడుతూ చెప్పేశాడు.