ఏలియ‌న్స్ దాడి నుంచి భూమిని కాపాడేది ఎవ‌రు?

*సూప‌ర్‌హీరో మూవీలో అమెరికా కోడ‌లు రోల్

బాలీవుడ్ అగ్ర క‌థానాయిక ప్రియాంక చోప్రా త‌న‌ కెరీర్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో హాలీవుడ్ లో బేవాచ్.. ఏ కిడ్ లైక్ జేక్ లాంటి చిత్రాల్లో న‌టించింది. అంత‌కుముందు క్వాంటికో టీవీ సిరీస్ లోనూ న‌టించింది. అమెరిక‌న్ సింగ‌ర్ కం న‌టుడు నిక్ జోనాస్ ప‌రిచ‌యం అటుపై ప్రేమ వివాహం నేప‌థ్యంలో మ‌ధ్య‌లో కెరీర్ కి బిగ్ బ్రేక్ ఇచ్చింది. పెళ్లి త‌ర్వాత ఈ జోడీ పూర్తిగా ప్ర‌యివేట్ లైఫ్ కే ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌డం ఆ క్ర‌మంలోనే పీసీ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల్ని వ‌దులుకోవ‌డం తెలిసిందే.

ప్ర‌స్తుతం తిరిగి క‌థానాయిక‌గా త‌న కెరీర్ ని చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో ఉంది పీసీ. త్వ‌ర‌లోనే నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం `వియ్ కెన్ బి హీరోస్`లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. స్పై కిడ్స్ ఫేం రోబ‌ర్ట్ రోడ్రిగ్ ఈ భారీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ సినిమా క‌థాంవం ఏలియ‌న్ బ్యాక్ డ్రాప్ తో ఆద్యంతం ఉత్కంఠ క‌లిగిస్తుంద‌ట‌. భూమిపై ఉన్న సూప‌ర్ హీరోలంద‌రినీ కిడ్నాప్ చేసి విధ్వంశాల‌కు పాల్ప‌డే ఏలియ‌న్స్ ని ఎదుర్కొనేందుకు కొంద‌రు కిడ్స్ ఏం చేశార‌న్న‌దే ఈ సినిమా ఇతివృత్తం. ఇందులో పీసీ పాత్ర ఏమిట‌నేది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.

అలాగే ప్రియాంక చోప్రా బాలీవుడ్ కెరీర్ కి సంబంధించి మునుముందు మరిన్ని అప్ డేట్స్ తెలియ‌నున్నాయి. ప్ర‌స్తుతం `ది స్కై ఈజ్ పింక్` అనే బాలీవుడ్ చిత్రంలోనూ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. కొంత గ్యాప్ త‌ర్వాత కంబ్యాక్ సినిమా కోసం పీసీ తిరిగి క‌స‌ర‌త్తు ప్రారంభించింది. అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ రెండు చోట్లా త‌న కెరీర్ ని తిరిగి కొన‌సాగించ‌నుంద‌ట‌. బాలీవుడ్ లో కొన్ని బ‌యోపిక్ చిత్రాల్లో న‌టించే అవ‌కాశాలు వ‌చ్చాయి. వీటికి సంబంధించి మ‌రింత అధికారిక స‌మాచారం తెలియాల్సి ఉంది.