అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ .. ఏకైక క్రికెటర్ !

విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఫార్మాట్ ఏదైనా మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఇప్పటికే క‌్రికెట్ అన్ని ఫార్మాట్ల‌లో ఎన్నో రికార్డులు తన పేరుపై లిఖించుకున్నాడు. దిగ్గజాలకు కూడా సాధ్యంకాని రికార్డులు కొల్లగొట్టాడు. మైదానంలో రికార్డుల మోత మోగించే విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనూ తనకి తిరుగులేదని నిరూపించాడు. తాజాగా అతని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 100 మిలియన్‌కి చేరింది.

 

భారత్‌ తరఫున ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సెలెబ్రిటీ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. ప్రస్తుతం ఇన్‌స్టాలో విరాట్ కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య సరిగ్గా వంద మిలియన్లు చేరుకుంది. ఇంత‌కుముందు ప్ర‌ముఖ సినీ న‌టీన‌టులు ప్రియాంక చోప్రా, ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకునే గతంలో విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో గట్టి పోటినిచ్చేవారు.

కానీ.. తాజాగా వారందరినీ వెనక్కి నెట్టేసిన విరాట్ కోహ్లీ.. ఇప్పట్లో తన నెం.1 స్థానానికి ఢోకా లేకుండా చేసుకున్నాడు. ప్రియాంక చోప్రా ఫాలోయర్ల సంఖ్య 60 మిలియన్‌కాగా.. దీపికా పదుకొణె‌ని 53.3 మిలియన్‌ మంది ఫాలో అవుతున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇన్‌స్టా‌గ్రామ్‌లో 51.2 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. సాకర్‌ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో (266 మిలియన్‌), లియోనెల్‌ మెస్సీ (184 మిలియన్‌), నేమార్‌ (147 మిలియన్‌) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలెబ్రిటీ విరాట్‌ కోహ్లీనే కావడం విశేషం. అలాగే ఈ లెవెల్ లో ఫాలోయింగ్ ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ ఒక్కడే.