నితిన్ కోసం లైన్ లోకి మిస్ ఇండియా
కొంత విరామం తరువాత నితిన్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం `ఛలో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో `భీష్మ` చిత్రంలో నటిస్తున్నాడు. నితిన్ చేతికి గాయం అవ్వడం వల్ల కొన్ని నెలల పాటు షూటింగ్ ఆలస్యమైంది. నితిన్ కోలుకోవడంతో ఈ చిత్ర షూటింగ్ ని స్పీడప్ చేశారు. విభిన్నమైన కథ.. కథనాలతో వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవలే నితిన్- రష్మికపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారని తెలుస్తోంది.
ఈ సినిమాతో పాటు నితిన్ అంగీకరించిన ఇతర చిత్రాలు కూడా పైప్ లైన్ లో వున్నాయి. వెర్సటైల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న చంద్రశేఖర్ ఏలేటి కొంత విరామం తరువాత నితిన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసందే. కొత్త తరహా కథల్ని తెరపై అంతే కొత్తగా ఆవిష్కరించే యేలేటి ఈ సినిమా కోసం నితిన్ కు జోడీగా ఏకంగా మిస్ ఇండియానే ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ నగరానికి ఏమైంది
తో పాటు చిన్నిచిత్రాల్లో నటించి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సిమ్రాన్ చౌదరి మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుని మోడలింగ్ లో రాణించింది. అటుపై సినిమాల్లోనూ నటించడం మొదలుపెట్టింది.
ఈ తెలంగాణ బ్యూటీ కెరీర్ ఈ సినిమాతో మలుపు తిరుగుతుందని ఆమె సన్నిహితులు భావిస్తున్నారు. నితిన్ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మిస్టర్ మజ్ను
ఫేమ్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న రంగ్ దే
సినిమాలోనూ నటిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.