నాగార్జున క‌ల్ట్ క్లాసిక్ సెన్సేష‌న్ `శివ‌`కు 30 ఏళ్లు

క‌ల్ట్ క్లాసిక్ ట్రెండ్ సెట్ట‌ర్ `శివ‌`

నాగార్జున క‌థానాయ‌కుడిగా  రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `శివ` సంచ‌ల‌నాల‌ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్ట‌ర్. కాలేజీ గొడ‌వ‌ల్ని.. బెజ‌వాడ రౌడీయిజాన్ని ఆర్జీవీ అలియాస్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌ త‌న‌దైన  సృజ‌నాత్మ‌క‌త‌తో ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్క‌రించారు. సైకిల్ చైన్ ని ఎన్నిర‌కాలుగా వాడొచ్చో ప్ర‌పంచానికి చాటి చెప్పిన  రేర్ ట్యాలెంట్ ఆర్జీవీది అనడంలో సందేహం లేదు. మ్యాస్ట్రో  ఇళ‌య‌రాజా సంగీతం అందించిన శివ‌ మ్యూజిక‌ల్ గానూ ఓ సంచ‌ల‌నం. నాగార్జున‌- వ‌ర్మ కెరీర్ లో ఆ సినిమా ఓ మైల్ స్టోన్. ఆ సినిమాతో నాగార్జున‌ హీరోయిజానికి ట్రెండ్ సెట్ చేసి కొత్త పుంత‌లు తొక్కించారు. 
 
కింగ్  కెరీర్ కే కొత్త అర్ధాన్ని తీసుకొచ్చిన చిత్ర‌మ‌ది. అప్పుడే సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన‌ వ‌ర్మ తొలి సినిమాతోనే త‌నేంటో నిరూపించుకున్నాడు. ఆ ప్ర‌యోగంతోనే నేటికి వ‌ర్మ ప‌రిశ్ర‌మ‌లో త‌న బ్రాండ్ ను చాటుకుంటున్నాడు. ఆయ‌న కెరీర్ లో ఎన్ని ప‌రాజ‌యాలు ఎదురైనా శివ సంచ‌ల‌నం టాలీవుడ్ లో ఓ చ‌రిత్ర‌.  తాజాగా ఈ సినిమాకు నేటితో మూడు ద‌శాబ్ధాలు. 5 అక్టోబ‌ర్ 1989 లో ఈ సినిమా విడుదలైంది. నాగార్జున‌-ఆర్జీవీ బృందం తమ‌ మ‌ధుర జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. నాగార్జున‌..ఇవాళ మ‌న ప్రియ‌మైన బిడ్డ 30వ పుట్టిన రోజు అని  ట్వీట్ చేసారు. శివ సినిమాపై అప‌రిమిత ప్రేమ‌ను కురిపిస్తూ బిడ్డ అని ప్ర‌స్థావించ‌డం విశేషం.