నితిన్ సతీమణి షాలినీ కందుకూరి సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు లేదా.. స్పెషల్ ఈవెంట్, ప్రత్యేకమైన రోజు అయినప్పుడు మాత్రమే స్పందిస్తుంది. షాలిని నిన్న ఓ పోస్ట్ చేసింది. షాలిని బర్త్ డే (జనవరి 7)ను నితిన్ తన సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా సెలెబ్రేట్ చేశాడు. ఈ క్రమంలో బర్త్ డే ఫోటోలు బాగానే వైరల్ అయ్యాయి.
షాలినీని బర్త్ డే సందర్భంగా ప్రైవేట్ క్లబ్, పబ్‌కు తీసుకెళ్లినట్టున్నాడు. అక్కడే కేక్ కట్ చేయించి అందరూ ఎంజాయ్ చేసినట్టున్నారు. ఈ సెలెబ్రేషన్స్‌లో వెన్నెల కిషోర్, వెంకీ కుడుముల మాత్రమే పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఈ ఇద్దరూ షాలినికి విషెస్ చెబుతూ పోస్ట్‌లు పెట్టేశారు. ఇక నితిన్ కూడా తన భార్యపై అంతులేని ప్రేమను కురిపించాడు. నీతో గడిపిన రోజులే ఎప్పటికీ గుర్తుంటాయి.. అందమైన రోజులు అవి అంటూ విషెస్ చెప్పేశాడు.
ఇక తన బర్త్ డే ఇంత సర్ ప్రైజింగ్‌గా మలిచినందుకు షాలిని ఎమోషనల్ అయింది. ఈ మేరకు ఓపోస్ట్ చేసింది. అందులో తాను కేక్ కట్ చేస్తున్న ఫోటోను, నితిన్ తనను ప్రేమగా పట్టుకున్న స్టిల్‌ను షేర్ చేసింది.ఈ ఫోటోను తీసింది వెంకీ కుడుముల అని చెబుతూ..మంచి క్షణాలను, ఆనందాలను ఇలా కెమెరాలో బంధించడంలో ఆయన దిట్ట అంటూ పొగిడేసింది. మొత్తానికి నితిన్ తన బ్లాక్ బస్టర్ భీష్మ టీంతో కలిసి ఇలా భార్య బర్త్ డేను సెలెబ్రేట్ చేసేశాడు.