డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సంచలన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కెరీర్ లో అట్టర్ ప్లాప్ లు ఎలా ఉంటాయో! హిట్ అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభజనం సృష్టిస్తుందో కూడా తెలిసిందే. ఇక పూరీని ఆదర్శంగా తీసుకుని డైరెక్టర్లు అవుతున్న వారు ఎందరో. పరిశ్రమలో పూరి అంటే ఇష్టపడని వారెవ్వరు ఉండరు. ఏ దర్శకుడిని కదిపినా పూరి గురించి ఎంతో గొప్పగా చెబుతారు. వి.వివినాయక్, శ్రీనువైట్ల, త్రివిక్రమ్, రాజమౌళి ఇలా ఒకరేంటి ప్రతీ ఒక్కరు పూరి ప్రతిభ గురించి..వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. అయితే పూరీ జీవితంలో.. పరిశ్రమలోనూ ఎదగనీయకుండా పుల్లలు వేసే వారు కూడా ఉన్నారని తాజా ఇంటర్వూ లీక్ చేసింది.
అంత మంచి మనిషి ఎదుగుదలను అడ్డుకునేదెవరు? అతన్ని ద్వేషించేదరు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూరీని తన పక్కనున్న స్నేహితులే వెన్ను పోటు పొడిచారని…దాదాపు 100 కోట్ల ఆస్తిని కోల్పోయానని పూరి చాలాసార్లు చెప్పారు. అలాగని పూరి ఎప్పుడూ వాళ్లపై కక్ష గట్టింది లేదని అన్నారు. నా పని నేను చేసుకుంటా! వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు!! అని అన్నారు. కక్షలతో సాధించేదేమి ఉండదని చాలాసార్లు అన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమా చేయాలని పూరి ఎప్పటి నుంచో ఆశపడుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ 150 చిత్రాన్ని పూరీనే తెరకెక్కాల్సి ఉండగా చివరి నిమిషంలో ఎవరో అడ్డుపడ్డారు. చిరు ఒకే చేసిన ఆటోజానీ విషయంలోనూ .. ఎవరో పుల్లలు వేసి చెప్పారని.. దాంతో ఆయన చేయడం మానేసారని పూరి తెలిపారు.
అలాగే బాలయ్య తో పైసా వసూల్ చేయాలనుకున్నప్పుడు ఆయనతో సినిమా చేయడం మంచిది కాదని బాలయ్య కు ఎవరో చెవిలో నూరిపోసారు. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా చెప్పారని పూరి రివీల్ చేసారు. అయినా వాళ్లిద్దరికీ పూరి ట్యాలెంట్ తెలుసు కాబట్టి వాటిని పట్టించుకోలేదని డ్యాషింగ్ డైరెక్టర్ చెప్పారు. అన్నట్లు పూరి టాలీవుడ్ కి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే పూరి విషయంలో పుల్లలు వేసేది ఎవరన్నది మాత్రం పూరి కూడా రివీల్ చేయలేదు. అలాంటి వాళ్లను అస్సలు పట్టించుకోనని పూరి తెలిపారు.