Pawan Kalyan: దర్శక నిర్మాతలు నా విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు.. పవన్ కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న సమయంలో ఈయన కమిట్ అయిన సినిమాలకు ఆలస్యం అవుతుంది ఒకవైపు తన బాధ్యతలను నిర్వహిస్తూ మరోవైపు సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం అంటే కాస్త కష్టం కనుక ఈయన ముందుగానే దర్శక నిర్మాతలకు కొన్ని సూచనలు చేశారట.

ఇలా తాను నా సినిమా దర్శక నిర్మాతలకు ముందుగానే అన్ని విషయాలు చెప్పిన వారు సరిగా నా డేట్స్ ఉపయోగించుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఒక నిర్దిష్ట సమయం మాత్రమే పని చేస్తానని వారికి స్పష్టంగా చెప్పానని అయితే మూడు సినిమాల నిర్మాతలు ముందుగానే సిద్ధం కాలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను చెప్పిన డేట్స్ కంటే కూడా ఎక్కువగానే సినిమాల కోసం పని చేశానని తెలిపారు..

ఓజీ మేకర్స్ ను తానే తొందర పెడుతూ సినిమా షూటింగ్స్ ను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇక హరిహర వీరమల్లు సినిమా మరొక ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ విజువలైజేషన్ పనిలో బిజీగా ఉందని, ఈ మూడింటిలో విడుదలయ్యే మొదటి సినిమా ఇదేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయమని చెప్పాను..స్క్రిప్ట్ సిద్ధంగా లేకపోవడమే ఆలస్యం కావడానికి ప్రధాన కారణం అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వెల్లడించారు. ఇక కొత్త సంవత్సరంలో పవన్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఈయన సినిమాల కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చివరిగా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి బ్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.