ఇద్దరు అగ్ర దర్శకులు కలుస్తున్నారట.!

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర దర్శకులనదగ్గర ఇద్దరు ప్రముఖులు ఓ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోసం కలిసి పని చేయబోతున్నారట.!

ఎవరా దర్శకులు ఏమా కథ.? వాస్తవానికి, ఆ దర్శకుడైతే.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించడంలో దిట్ట.! ఆయన దగ్గర చాలా చాలా కథలున్నాయ్. వాటిని, యంగ్ డైరెక్టర్స్‌కి ఇచ్చి సినిమాలు చేయిస్తుంటాడు. నిర్మాణం పరంగానూ సాయమందిస్తుంటాడు.

అలాంటి దర్శకుడు, ఇంకో దర్శకుడితో కలిసి పని చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇద్దరూ ప్రముఖ దర్శకులే. వాస్తవానికి, ఈ కలయిక ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వల్ల సాధ్యమవుతోందిట.

పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. నిజానికి, రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టబోతున్నాయట. ఓ బ్యానర్ ఎక్కువ మొత్తం పెట్టుబడి పెడుతోంటే, ఇంకో బ్యానర్ కాస్త తక్కువ పెట్టుబడి పెట్టనుంది.

ఇంతకీ, ఎవరా ఇద్దరు ప్రముఖ దర్శకులు.! జస్ట్ వెయిట్ అండ్ సీ.!