రవితేజ మీదనే ఎందుకిలా.?

రవితేజ అంటే ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరో.! ఆ తర్వాత, లాభాలు తెచ్చే హీరో. సూపర్ హిట్లు కొట్టిన హీరో. బంపర్ హిట్లు దక్కించుకున్న హీరో. ఫ్లాపులూ వున్నాయ్. కాకపోతే, నష్టాలు తక్కువే వుండేవి. కానీ, ఈ మధ్య సీన్ మారిపోయింది.

దాదాపుగా ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద తన్నేస్తోంది. ఓటీటీ మార్కెట్ పుణ్యమా అని ఇతర సినిమాల నిర్మాతలెలా గట్టెక్కుతున్నారో, అలాగే రవితేజతో సినిమాలు చేస్తున్న నిర్మాతలూ గట్టెక్కేస్తున్నారు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు కదా.?

నిర్మాతల ముక్కు పిండి మరీ తన రెమ్యునరేషన్‌ని రవితేజ వసూలు చేస్తాడన్న వాదన ఒకటుంది. అదంతా నాన్సెన్స్.. అనే వాదనా లేకపోలేదు.! ఎవరి గోల ఎలా వున్నా, ఈ మధ్య రవితేజ సినిమాలు వరుసగా తన్నేస్తున్న దరిమిలా, రెమ్యునరేషన్ తగ్గించుకోవాలంటూ రవితేజ మీద ఒత్తిడి పెరుగుతోందట.

అదే సమయంలో, లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమా చేస్తే రవితేజతో సేఫ్ వెంచర్ వస్తుంది కదా.? అనీ చాలామంది నిర్మాతలు, దర్శకులకు సూచిస్తున్నారట. పాన్ ఇండియా ట్రెండ్ కారణంగానే అసలు సమస్య వస్తోంది. రేంజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు.. వర్కవుట్ అవ్వకపోతే నష్టాలు ఎక్కువైపోతున్నాయ్.

రవితేజ అంటే, నిర్మాతల ఫ్రెండ్లీ.. రిస్కీ స్టంట్స్ చేసేస్తాడు, సినిమా ప్రమోషన్లకూ బాగా సహకరిస్తాడు. మరి, ఎక్కడ తేడా కొడుతోందబ్బా.? సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపైనా పట్టున్న రవితేజ లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో ఏమో.!

నిర్మాతలు, దర్శకుల సంగతెలా వున్నా, రవితేజ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే.