పూరి సినిమాలో విజ‌య్‌ రోల్ ఇదేనా?

న‌త్తిగా మాట్లాడే డాన్ క‌థ‌తోనా?

`ఇస్మార్ట్ శంక‌ర్‌` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు పూరి జ‌గ‌న్నాథ్. ఈ స‌క్కెస్ కిక్కులో వున్న పూరి అదే కిక్కుతో రౌడీ దేవ‌ర‌కొండ‌తో భారీ సినిమాకు ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు ఫైన‌ల్ స్క్రిప్ట్‌ని పూరి లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. పూరీ మార్కు వుంటూనే క‌థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెరుపులు వుంటాయ‌ట‌. ఇందులో హీరో విజ‌య్ ఓ డాన్ కొడుకుగా క‌నిపిస్తాడ‌ని, అత‌ని మాఫియా సామ్రాజ్యాన్ని కొడుకుకు క‌ట్ట‌బెట్టాల‌నుకుంటాడ‌ట‌. అయితే న‌త్తితో బాధ‌ప‌డే హీరో ఎలా అందుకు స‌మ‌ర్ధుడ‌న్న ప్ర‌శ్న రైజ్ కావ‌డంతో వెన‌క్కి త‌గ్గుతాడ‌ట‌.

రౌడీతో బాల‌య్య‌నా వెంకీనా?

అది గ‌మ‌నించిన హీరో ఎలా త‌న న‌త్తిని ఓవ‌ర్ కం అయ్యాడు? ఎలా త‌న తండ్రి నేర సామ్రాజ్యానికి అధిప‌తి అయ్యాడు? అన్న‌ది పూరీ మార్కు క‌థ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. మాఫియా నేప‌థ్యంలో సాగే ఈ సినిమాకు `ఫైట‌ర్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారని తెలుస్తోంది. విజ‌య్ కి తండ్రిగా ఓ ప్ర‌ముఖ సీనియ‌ర్ హీరోని పూరి అడుగుతున్న‌ట్లు తెలిసింది. ఆ హీరోకు భీభ‌త్స‌మైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా వుందిట‌. బాల‌య్య‌, వెంక‌టేష్‌ల‌ని ఈ పాత్ర కోసం సంప్ర‌దిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇద్ద‌రిలో ఎవ‌రు ఓకే అన్నా ప్రాజెక్ట్ రేంజ్ మామూలుగా వుండ‌దు అన్న‌ది ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. హీరోయిన్‌గా జాన్వీ క‌పూర్ వుండే అవ‌కాశం క‌నిపిస్తోంది.