పూరి జగన్నాథ్ ఛార్మీ ముంబైలోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ నుంచి అక్కడే ఉండిపోయారు. ఫైటర్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసేసిన పూరి, ఛార్మీ అక్కడే ఇరుక్కుపోయారు. ఇక అప్పటి నుంచి హైద్రాబాద్‌లో అడుగే పెట్టలేదు. మొత్తానికి ఈ తొమ్మిది పది నెలలు అక్కడే ఇద్దరూ గడిపేశారు. కానీ విజయ్ మాత్రం లాక్డౌన్‌ను హైద్రాబాద్‌లోనే గడిపాడు. పూరి చార్మీ మాత్రం ఎన్ని పండుగలు వచ్చినా స్పెషల్ అకేషన్స్ వచ్చినా కూడా అక్కడే ఉండిపోయారు.
మొన్న RED ఈవెంట్‌లో పూరి జగన్నాథ్, చార్మీలు వీడియో బైట్‌లు మాత్రమే పంపారు. రామ్‌కు, నిర్మాత స్రవంతి రవికిషోర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే పూరి, ఛార్మీలతో పాటు ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అక్కడే చేరినట్టు కనిపిస్తోంది. మొత్తంగా ఈ ముగ్గురు ఇప్పుడు ముంబైలోని పూరి ఆఫీస్‌లోనే ఉన్నారు. ఫైటర్ సినిమాను ఎలా ప్రారంభించాలనే దానిపై చర్చలు జరుపుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ నెల చివర్లో షెడ్యూల్‌ను మళ్లీ ప్రారంభించేలా ఉన్నారు.
ఇలా సినిమా కోసం ఆలోచిస్తూ పండుగ రోజూ కూడా అదే మూడ్‌లో ఉన్నట్టున్నారు. తాజాగా ఛార్మీ ఓ ఫోటోను షేర్ చేసింది. విజయ్ దేవరకొండ ఫోటోను ఛార్మీ షేర్ చేస్తూ మా తరుపు నుంచి మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అని చెప్పుకొచ్చింది. ఇందులో విజయ్ ఏదో తీక్షణంగా శ్రద్దగా వింటున్నట్టు కనిపిస్తోంది. పూరి తన స్టోరీ గురించి మళ్లీ వివరిస్తున్నాడో లేదా ఏదైనా సీన్ గురించి చర్చిస్తున్నారో తెలియడం లేదు. మొత్తానికి ఈ ఫైటర్ మాత్రం మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టబోతోన్నాడు.