సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ముంబై పోలీసులు రియా చక్రవర్తికి ఫేవర్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. సుశాంత్ బ్యాంక్ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ప్రకారం.. రియా చక్రవర్తితో పెద్దగా ఆర్థిక లావాదేవీలు చూపించలేదని పోలీసులు వెల్లడించారు. సుశాంత్ బావగారైన కెకె సింగ్ ఎఫ్ఐఆర్ లో ప్రధాన నిందితురాలిగా పేర్కొన్న రియాను అనుమానించడానికి లావాదేవీల జాడ ఏదీ కనుగొనలేదు. సుశాంత్- రియా జంట విదేశీ పర్యటనలు ..ఇతర సాధారణ గృహ ఖర్చులు తప్ప వేరే నిధి దుర్వినియోగం ఏదీ జరగలేదని నివేదిక తెలిపింది.
అయితే ముంబై మిర్రర్ నివేదిక ప్రకారం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రియా ఖాతాకు ప్రత్యక్షంగా డబ్బు బదిలీని కనుగొనలేదని ధృవీకరించిన కొద్దిసేపటికే వేరొక ప్రకటన వెలువడడం కలకలం రేపుతోంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్టు సుశాంత్ ఖాతాలో రూ .15 కోట్లు లేవని కేంద్ర ఏజెన్సీ ధృవీకరించినప్పటికీ, నటి ఖాతాలో ఎలాంటి లావాదేవీలు కనుగొనలేదు. ఈ మొత్తం ఎక్కడ ఖర్చు చేసారు? దాని ప్రయోజనం ఏమిటో తెలుసుకోవడానికి వారు ఇంకా ప్రయత్నిస్తున్నామని ఈడీ పేర్కొంది… అంటూ సదరు పత్రిక పేర్కొంది.
రియా చక్రవర్తి, సోదరుడు షోయిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, సుశాంత్ తండ్రి ‘ఆత్మహత్యకు పాల్పడటం’, ‘దొంగతనం’ సహా పలు ఆరోపణలపై నిందితులుగా ఉన్నారు. ఆ ముగ్గురిని ఈడి ప్రశ్నించింది. మాజీ మేనేజర్ శ్రుతి మోడీ, హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, రూమ్ మేట్ సిద్ధార్థ్ పితాని, నటుడి టాలెంట్ మేనేజర్, చార్టర్డ్ అకౌంటెంట్స్, రాజ్‌పుత్ సోదరి, తండ్రి కూడా ఈ విషయంపై ప్రశ్నించడానికి ఆర్థిక సంస్థల్ని బ్యాంకును ప్రశ్నించారు.
ఇంతలో, ఈ కేసును పాట్నా నుండి ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలువడాల్సి ఉంది. మరోవైపు, సుశాంత్ సోదరీమణులు ఈ విషయంలో సిబిఐ దర్యాప్తును కోరుతూ సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ రోజు ఉదయం సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సుప్రీం కోర్టుని `ముందస్తు నిర్ణయం` కోసం అడగమని ట్వీట్ చేసినప్పుడు, “మేము చాలా ఆశాజనకంగా ఉన్నాం. ఓపికగా ఎదురుచూస్తున్నాం. ప్రతి నిమిషం ఆలస్యం నొప్పిని కలిగిస్తోంది. హృదయ వేదనను కలిగిస్తుంది“ అని వేరొక సోదరి రిప్లయ్ ఇచ్చారు. అంటే సుశాంత్ సోదరీమణులు కుటుంబీకులు సీబీఐ దర్యాప్తును కోరుతున్నట్టు స్పష్టమైంది. ఇప్పటికి ఇంకా ఆ 15కోట్లు ఎలా సుశాంత్ ఖాతా నుంచి మాయమైంది? దేనికోసం ఖర్చు చేశారు? అన్నది తేలలేదు.