దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగ ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఈ బతకాల ద్వారా అతివృష్టి,అనావృష్టి వల్ల నష్టపోయిన రైతులు నష్టపరిహారం అందించి ఆదుకోవటమే కాకుండా పెట్టుబడికి కావాల్సిన విత్తనాలు ఎరువులు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఇప్పటికే పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా కేంద్రం ప్రతి సంవత్సరం 6000 రూపాయలు రైతుల అకౌంట్లోకి జమ చేస్తుంది. ఇక అలాగే అర్హులైన రైతులందరికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్క్రీమ్ ద్వారా కూడా ఆర్థిక సహాయం అందిస్తోంది. చాలాకాలంగా ప్రజలందరూ ఈ పీఎం కిసాన్ సన్ నిధి యోజన స్కీం ద్వారా వచ్చే ఆర్థిక సహాయం కోసం వేచి చూస్తున్నారు.
ఇక ఇటీవల ఎట్టకేలకు ప్రజలు ఇంతకాలం వేచూసిన రోజు రానే వచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్క్రీమ్ కింద అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ స్క్రీమ్ 13వ విడత నగదును ఈరోజు సోమవారం 8 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 16,800 కోట్ల మొత్తాన్ని ప్రధాని మోదీ విడుదల చేసారు. సోమవారం కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. బెలగావి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ 13వ విడత డబ్బులను విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీతోపాటు.. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా కూడా హాజరుకానున్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్క్రీమ్ పథకంలో భాగంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 2.25 లక్షల కోట్లు పంపిణీ చేసింది. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి.
పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో మీ పేరు తెలుసుకోవటానికి :
1. ముందుగా https://pmkisan.gov.inకి లాగిన్ కావాలి.
2. ఆ తర్వాత ‘ఫార్నర్ కార్నర్ ‘పై క్లిక్ చేయాలి.
3. ‘ఫార్నర్ కార్నర్ ‘లో లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయాలి.
4. ఆ తరువాత మీ రాష్ట్రం, జిల్లా, తహసీల్, బ్లాక్, గ్రామాన్ని సంబంధించిన వివరాలు నమోదు చేయాలి.
5. ఆ తర్వాత ‘గెట్ రిపోర్ట్’ పై క్లిక్ చేయాలి.
6. అనంతరం అన్ని వివరాలతో లబ్దిదారుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది.