ప్రస్తుత కాలంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అందుకే కుటుంబం మొత్తం కుటుంబ పెద్ద పై ఆధారపడకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ వారి పేరు మీదట ఏదో ఒక స్కీం ద్వారా డబ్బులను సేవింగ్స్ చేస్తున్నారు.ఇలా భర్త చనిపోయిన తర్వాత భార్య ఒంటరిగా ఎవరిపై ఆధారపడకుండా ఉండాలి అంటే మీ భార్య పేరు పై నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాలో ప్రతినెల ఎవరిపై ఆధారపడకుండా ఏకంగా 45 వేల రూపాయల పెన్షన్ పొందవచ్చు.
ఒక మహిళ 30 సంవత్సరాల వయసు నుంచి ఈ స్కీం ద్వారా ప్రతినెలా 5000 రూపాయలను ఇన్వెస్ట్ చేయాలి ఇలా 60 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఉంటుంది 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి నెల 45 వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు.ఈ విధంగా 30 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ప్రతినెల 5000 రూపాయల పెట్టుబడి పెట్టడం వల్ల ఈ స్కీం మెచ్యూరిటీ పూర్తి అయ్యే సమయానికి 1.12 కోట్ల రూపాయల వరకు జమ అవ్వడమే కాకుండా ప్రతి ఏడాది 10% చొప్పున వడ్డీ కూడా వస్తుంది.
ఇలా ఈ పథకం మెచ్యూరిటీ పూర్తి అయ్యేసరికి ఆ మహిళ తన జీవితకాలం వరకు నెలకు 45 వేల రూపాయల చొప్పున పెన్షన్ పొందవచ్చు అయితే ఈ నేషనల్ పెన్షన్స్ స్కీం ఖాతా తెరవడానికి ₹1000 అవసరమవుతుంది. ఇలా ఈ పథకం ద్వారా మీ భార్య వయసు పైబడిన తర్వాత ఎవరిపై ఆధారపడకుండా తన పెన్షన్ డబ్బులతోనే తన జీవితాన్ని గడపవచ్చు.