రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలులోకి తీసుకు వచ్చింది. ఇలా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పథకాలలో పిఎం కిసాన్ యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 6000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల అకౌంట్ లోకి నేరుగా జమ చేస్తుంది. పథకం ద్వారా ఇటీవల పీఎం కిసాన్ యోజన 12వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది.
అక్టోబర్ 17వ తేదీన దాదాపు 8 కోట్ల మంది అర్హులైన రైతులకు డీబీటీ బదిలీ ద్వారా రైతుల అకౌంట్లోకి 2000 విడుదల చేశారు. అయితే కొందరు రైతుల అకౌంట్లో ఈ 12వ విడత నిధులు జమ కాకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే 12వ విడత సీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 12వ విడత డబ్బులు రైతుల అకౌంట్లోకి ఎందుకు జమ కాలేదో తెలుసుకోవటానికి pmkisan-ict@gov.inవెబ్ సైట్ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా పిఎం కిసాన యోజన – 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 యొక్క హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించి కూడా 12వ విడత పిఎం కిసాన్ డబ్బుల గురించి సందేహాలు అడిగి పూర్తి సమాచారం పొందవచ్చు.
పీఎం కిసాన్ యోజన జాబితాను చెక్ చేసుకోవటానికి ఇలా చేయండి..
పీఎం కిసాన్ యోజన 12వ విడత జాబితా చెక్ చేయడానికి pmkisan.gov.in ఆని ఉన్న అధికారిక వెబ్‌సైట్ లో లాగిన్ అవ్వండి.
• ఆ తర్వాత హోం పేజీలో కుడివైపును ఫార్మర్స్ కార్నర్ అని ఉన్న దానిపై క్లిక్ చేయండి.
• ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్ విభాగంలో ఉన్న బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
• అందులో పీఎం కిసాన్ అకౌంట్ నెంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లలో ఎదైనా ఒకటి సెలక్ట్ చేసుకోండి.
• ఇలా అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత గేట్ డేటాపై క్లిక్ చేసి పూర్తి సమచారం పొందవచ్చు.