జన్ ధన్ బ్యాంక్ అకౌంట్ల గురించి మనలో చాలామందికి తెలుసు. ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా సులువుగా జన్ ధన్ అకౌంట్లను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత మొత్తాన్ని మాత్రమే విత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. అయితే అకౌంట్ లో డబ్బులు లేకపోయినా సులువుగా 10,000 రూపాయలు విత్ డ్రా చేసే అవకాశం అయితే ఉంది.
ప్రజలు బ్యాంకులలో డబ్బులు దాచుకోవడాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నవాళ్లు సైతం జన్ ధన్ ఖాతాలను ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసి రూపే కార్డ్ కలిగి ఉన్నవాళ్లకు 2 లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ కవరేజ్ బెనిఫిట్స్ అయితే లభిస్తాయి. ఈ స్కీమ్ ద్వారా 10,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
జన్ ధన్ ఖాతాలను కలిగి ఉండటం వల్ల ఇతర ప్రయోజనాలను కూడా సులువుగా పొందే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులలో కూడా ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. జన్ ధన్ అకౌంట్ ఉండటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. జన్ ధన్ ఖాతాల వల్ల లాభం తప్ప నష్టం తప్పదు. ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లు వెంటనే జన్ ధన్ ఖాతాను ఓపెన్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.