హీరో రామ్ ని కలవాలంటే..ఈ చిన్నపని చేస్తే చాలు

హీరో రామ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన్ని కలవాలని , ఫొటో దిగాలని, కబుర్లు చెప్పాలని చాలా మందికి ఉంటుంది. అందుకు మార్గం దొరకటం కష్టం. అయితే ఆ కష్టాన్ని చిన్న ఇష్టమైన పనితో సులభం చేస్తానంటోంది ఇస్మార్ట్ శంకర్ టీమ్.

రామ్ తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్” టీమ్ రామ్ అభిమానుల కోసం ఓ కాంటెస్ట్ కండక్ట్ చేస్తోంది. అదేంటంటే రీసెంట్ గా విడుదలైన రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ టీజర్ లోని మీకు నచ్చిన డైలాగ్ టిక్ టాక్ వీడియో చేసి పంపితే చాలు. మీరు కనుక ఆ వీడియో లో “ఇస్మార్ట్ శంకర్” టీమ్ ని ఇంప్రెస్ చేయగలిగితే రామ్ ని కలిసే ఆ గోల్డెన్ ఛాన్స్ మీరు తగిలినట్లే. స్మార్ట్ ఫోన్ తీసుకొని వీడియో చేసేయండి..రామ్ ని కలవండి.

పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్ డైరక్షన్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా నటిస్తున్న మూవీ “ఇస్మార్ట్ శంకర్” ప్రమోషన్ లో భాగం గా చిత్ర యూనిట్ ఈ కాంటెస్ట్ నిర్వహిస్తుంది. హీరోయిన్ ఛార్మి నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ మూవీలో రామ్ సరసన నిధి అగర్వాల్, నాభా నటేష్ నటిస్తుండగా మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.