విరాటపర్వం ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది !

బాహుబ‌లి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రానా లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’తో బిజీగా ఉన్నాడు. ఈ రోజు రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా ‘విరాటపర్వం’లోని ఆయన పాత్ర ‘కామ్రేడ్ రవన్న’ను పరిచయం చేస్తూ, ఫస్ట్ గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసిన.

First Look: Rana Daggubati as a 'lionhearted' character in 'Virataparvam' -  Telugu News - IndiaGlitz.com

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనిర్మితమవుతున్న ఈ చిత్రానికి యూ వేణు దర్శకత్వం వహిస్తుండగా, రానాతో పాటు సాయి పల్లవి, ప్రియమణి, నివేదితా పేతురాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ టీజర్ లో రానా నక్సల్స్ నేతగా కనిపిస్తున్నాడు. చేతిలో గన్ తీసుకుని, తన సహచరులతో కలిసి నడుస్తుండటం, అడవుల దృశ్యాలు, వాటర్ ఫాల్స్, కొన్ని సీన్స్ జోడించారు. ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది.. అంటూ ప్రారంభమయ్యే టీజర్ లో “సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది. అన్న లెటర్స్ కనిపిస్తున్నాయి.

ఇక రవన్న పాత్ర నక్సల్ గా మారకముందు డాక్టర్ రవిశంకర్ అని కూడా చెప్పేశారు. టీజర్ చివర్లో ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం… దొంగల రాజ్యం, దొపిడి రాజ్యం అని కూడా వినిపిస్తోంది.