పర్శనల్ కేర్ తీసుకుంటున్న నాగ చైతన్య.?

ఇప్పుడు అక్కినేని కుటుంబ హీరోలు టాలీవుడ్ లో ఓ గట్టి కం బ్యాక్ సినిమా కోసం చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఏడాది ఎన్నో అంచనాలు పెట్టుకొని వచ్చిన ఏ సినిమా కూడా అక్కినేని హీరోస్ నుంచి సరిగా ఆడలేదు. అఖిల్ నటించిన ఏజెంట్ గాని నాగ చైతన్య నటించిన కస్టడి కానీ భారీ డిజాస్టర్ లు అయ్యాయి.

కాగా ఈ సినిమాలుతో పాటుగా కింగ్ నాగార్జున నటించిన సినిమా ఘోస్ట్ కూడా సరిగా ఆడలేదు. దీనితో ఇక నెక్స్ట్ వచ్చే సినిమాలు అయినా పెద్ద హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఇదిలా ఉండగా నాగ చైతన్య ఓ భారీ సినిమాని అయితే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

దర్శకుడు కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి తో టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లలో ఒకటైన గీతా ఆర్ట్స్ లో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. అయితే నిజ జీవిత సంఘటనలు ఆధారంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తుండగా టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి కూడా యాడ్ అయ్యింది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం నాగ చైతన్య చాలా పర్శనల్ గా తీసుకున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

హీరోయిన్ సాయి పల్లవి ఎంపిక విషయంలో కూడా చై హస్తం ఉందని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అంతే కాకుండా సినిమా బడ్జెట్ సహా ఇతర అంశాల్లో కూడా చై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈసారి సినిమా విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా మంచి హిట్ అందుకోవాలి అని తాపత్రయ పడుతున్నాడట. మరి ఇంత పర్శనల్ గా తీసుకుంటున్న ఈ సినిమాకి ఏమవుతుందో చూడాలి.