అఫీషియల్ : మరోసారి చై, సాయి పల్లవి..వైరల్ గా సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్ 

Naga Chaitanya's Love Story will be out on July end

టాలీవుడ్ లో ఉన్న పలు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ లో అయితే సెన్సేషన్ హిట్ అయ్యిన జంట అక్కినేని వారి యంగ్ హీరో నాగ చైతన్య అలాగే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కాంబినేషన్ కూడా ఒకటి. మరి ఈ కాంబినేషన్ నుంచి వచ్చిన మొదటి సినిమా “లవ్ స్టోరీ” పెద్ద హిట్ కావడంతో వీరి జంటకి మంచి క్రేజ్ ఏర్పడింది.

కాగా రీసెంట్ గానే మళ్ళీ వీరి కాంబినేషన్ పడొచ్చు అని కూడా మేము తెలియజేశాము. ఇక ఇప్పుడు ఫైనల్ గా అయితే మేము చెప్పినట్టుగా మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనిని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసేసారు. కాగా ఈ చిత్రాన్ని కార్తికేయ 2 ఫేమ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా దిగ్గజ బ్యానర్ గీతా ఆర్ట్స్ వారు భారీ స్కేల్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఫైనల్ గా హీరోయిన్ గా అయితే సాయి పల్లవిని లాక్ చేసి అనౌన్స్ చేయగా మరి ఈ గుడ్ న్యూస్ ని సాయి పల్లవి కూడా షేర్ చేసింది. దీనిపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి ఈ లవింగ్ టీం తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని గీతా ఆర్ట్స్ వారు నాకు మంచి వెల్కమ్ ఇచ్చారు. నాగ చైతన్య గారు మీతో కలిసి మరో స్పెషల్ సినిమా చేస్తున్నాను.

అందుకు చాలా సంతోషంగా ఉంది అని అలాగే నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులకి మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను చైతన్య 23వ సినిమాతో అయితే మళ్ళీ కలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను” అని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీనితో తెలుగు సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.