హాస్పటిల్ లో నటి…సాయిం పేరుతో లైంగిక వేధింపులు

అనారోగ్యంతో బాధ పడుతున్న ఒక మహిళా నటిని ఒక నటుడు లైంగికంగా వేధించిన వైనం తాజాగా బయటకు వచ్చి అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ వేధింపులకు సంబంధించి పోలీసులకు ఒక నటి కంప్లైంట్ చేయటంతో మీడియాలో సంచలనంగా మారింది.ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే.. హాస్పటిల్ లో ఉన్న నటికి సాయం చేసి, అది ఆసరాగా తీసుకుని ఆ నాటి నుంచి ఆమెను ఆ నటుడు వేధింపులకు గురి చేయటం.

పూర్తి వివరాల్లోకి వెళితే..కన్నడ నటి విజయలక్ష్మీ అనారోగ్యంతో బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆసుపత్రిలో ఉన్న వేళ తనకు సాయం చేయాలని మీడియాలో కొద్ది రోజుల క్రితం కోరారు. దీనికి స్పందించిన నటుడు రవిప్రకాష్ ఆసుపత్రికి వెళ్లి ఆమెకు రూ.లక్ష సాయం చేశారు. అందరూ మెచ్చుకున్నారు. అయితే..ఆ సాయం చేసిన నాటి నుంచి ఆమెను వేధించటం మెదలుపెట్టినట్లుగా ఆమె చెబుతున్నారు.

రోజూ ఆమె ఉన్న హాస్పటిల్ కు రావటం, ఐసీయూకి వచ్చి పోవటం.. ఫోన్లో అసభ్యంగా సందేశాలు పంపటం చేసాడట..అంతేకాకుండా తనను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇదంతా వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో ఆమె పెట్టిన సందేశం ఇప్పుడు వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ ఆరోపణల్నినటుడు రవిప్రకాశ్ ఖండించారు.

విజయ లక్ష్మి చెబుతోన్న విషయాల్లో వాస్తవం లేదని అంటున్నాడు రవిప్రకాష్. అసలు ఆమె పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లిందో అర్ధం కావడం లేదని వాపోయాడు. శనివారం నాడు పుత్తెనహళ్లిలో పోలీసులను కలిసి జరిగిన విషయాలను వివరించానని వెల్లడించారు. విజయలక్ష్మితో తాను ఏం మాట్లాడరనే విషయాలను సంబంధించిన తన దగ్గర రికార్డ్స్ ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఎవరిది తప్పు ఉంది..ఎందుకీ ఆరోపణలు అనేది త్వరలోనే పోలీస్ లు ఛేదించనున్నారు.