మద్యానికి బానిసైన వ్యక్తి భార్యా పిల్లలను ఏం చేశాడో తెలిస్తే షాక్..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు మద్యానికి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా యువకులు మద్యానికి అలవాటు పడి దానికి బానిసగా మారుతున్నారు. మద్యం మధ్యలో చాలామంది అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. మద్యానికి బానిసైనా వారు దాన్ని మత్తులో పడి కుటుంబ సభ్యుల మీద కనికరం లేకుండా హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం కి బానిసైనా భర్త తన భార్య పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసిన ఘటన సంచలనగా మారింది.

వివరాలలోకి వెళితే…బెంగళూరులో కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో నాగేంద్ర అనే వ్యక్తి భార్య ఇద్దరు కూతుర్లతో కలిసి నివసిస్తున్నారు. కొంతకాలం క్రితం నాగేంద్ర కి క్యాన్సర్ వ్యాధి దొరికింది. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న నాగేంద్ర డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకోవాలని భావించి మనికట్టు కోసుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు గమనించి అతనిని రక్షించారు. నాగేంద్రకు క్యాన్సర్‌ రావడంతో ఇంటి నిర్వహణ బాధ్యతను అతని భార్య విజయలక్ష్మి తీసుకుంది. క్యాన్సర్ సోకిందన్న డిప్రెషన్ నాగేంద్ర మద్యానికి బానిస అయ్యాడు.

కొన్నాళ్లుగా నాగేంద్ర నిత్యం మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు . తాజాగా నాగేంద్ర మద్యం సేవించి ఇంటికి రావటంతో విజయలక్ష్మి కి అతనితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే గొడవ పడిన భార్య మీద కోపంతో వారు తినే ఆహారంలో విషం కలిపి భార్య, ఇద్దరు కూతుళ్లకు పెట్టాడు. ఆ ఆహారం తిన్న భార్య ఇద్దరూ పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. మరుసటి రోజు ఉదయం విజయలక్ష్మి సోదరుడు వారి ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.