విజయ్ దేవరకొండ ఇలా అనేసాడేంటి,నిర్మాత ఫీలవడా
మనస్సులో ఉన్న పైకి ఫిల్టర్ లేకుండా మాట్లాడేవాళ్లు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటివాళ్లలో విజయ్ దేవరకొండ ఒకరు. తన సక్సెస్ ని ,ఫెయిల్యూర్ ని ఏక్సెప్ట్ చేయగలగటం అతని గొప్పతనం. తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ స్లోగా ఉందని రివ్యూలు వచ్చిన నేపధ్యంలో ఆయన మీడియాతో చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్య పరిచాయి. సినిమా చాలా స్లోగా ఉందని, కథనం సరిగా లేదని కొందరు అభిప్రాయపడ్డారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో సినిమా ఫలితంపై విజయ్ మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు విన్న వాళ్ళు షాక్ అయ్యి, నిర్మాత, దర్శకుడు ఏమనుకుండా అనేసాడని అంటున్నారు.
`సినిమాను ప్రజల దగ్గరకు తీసుకెళ్లడానికి ఏమి చేయాలో అంతా చేశాం. ఏ చిన్న విషయాన్నీ వదిలేయకుండా కష్టపడ్డాం. సినిమా విడుదలైనప్పటి నుంచి రకరకాల ఫీడ్ బ్యాక్ వస్తోంది. సినిమా చాలా స్లోగా ఉందని కొందరు అంటున్నారు. అందరి అభిప్రాయాలతోనూ నేను ఏకీభవిస్తున్నా. ఇలాంటి సినిమా చూడాలంటే ఎక్కువ ఓపిక ఉండాలి. కాస్త ఓపిగ్గా చూస్తే సినిమా నచ్చుతుంది. ఏదేమైనా నాలుగు భాషల్లోని ఇంత మంది జనాలను తొలిరోజు థియేటర్లకు రప్పించగలగడం చాలా సంతోషంగా ఉంద`ని విజయ్ అన్నాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `డియర్ కామ్రేడ్`. తెలుగుతోపాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. తొలి రోజు అన్ని భాషల్లోనూ మంచి కలెక్షన్లు సాధించింది. అయితే సినిమాపై మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.