‘టాక్సీవాలా’ట్రైలర్…నయనతార సినిమా గుర్తు వస్తోందే..

ఆ మధ్యన నయనతార ప్రధాన పాత్రలో డోర అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కారులో దెయ్యం ఉండి కథని నడిపిస్తుంది. నయనతారను భయపెడుతుంది…స్నేహం చేస్తుంది. తనకు కావాల్సిన పనులు, పగ తీర్చుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా టాపిక్ ఎందుకు గుర్తు వచ్చిందీ అంటే…

సెన్సేషన్ హీరో విజయ్ దేవర కొండ నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ చూస్తూంటే డోర సినిమా గుర్తుకు రావటం ఖాయం.మీరు చూసి..మీకేమనిపించిందో చెప్పంది.

Taxiwaala Theatrical Trailer | Vijay Deverakonda, Priyanka Jawalkar, Rahul Sankrityan

ఇక ఈ ట్రైలర్‌లో సడెన్ గా ఓ బ్లాక్ కారు వచ్చి ఆగుతుంది. అందులో ఉన్న హీరో విజయ్ దేవరకొండ.. కారు అద్దానికి ఉన్న చేతి ముద్రను చూసి పెద్దగా అరుస్తూ కిందకి దూకటంతో మొదలవుతుంది. ఈ సీన్ ఎంతో థ్రిల్లింగ్‌గా, హార్రర్‌గా భయపెట్టేలా ఉంది.

ఆ తర్వాత విజయ్ దేవర కొండ పాత్రను పరిచయం చేస్తూ.. ఐదేళ్లు దండయాత్ర చేసి డిగ్రీ పూర్తి చేశావనమాట. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్ రా.. అంటూ వాయిస్‌ వస్తుంది. ఈ థియేట్రికల్ ట్రైలర్ 2 నిమిషాల 10 సెకన్లు తో ఇంట్రస్టింగ్ గా ఉంది. ఇక ట్రైలర్‌లో వచ్చే సీన్స్ , డైలాగులు ప్రేక్షకులను ఆకట్టునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది.

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్ మరియు యువి క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎస్‌కె‌ఎన్ నిర్మించారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు.