‘డియర్ కామ్రేడ్’ఫస్ట్ టాక్ , హిట్టేనా?లేక..
విజయ్ దేవరకొండ తాజా చిత్రం‘డియర్ కామ్రేడ్’.నూతన దర్శకుడు భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతోంది. ‘గీతా గోవిందం’వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమా పై ఎక్సెపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. వాటిని అందుకుందా లేదా అనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ఈ చిత్రం షోలు ఇప్పటికే ఓవర్ సీస్ లో పడ్డాయి. అక్కడ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఏవరేజ్ టాక్ తో నడవనుంది. విజయ్ దేవరకొండ గత చిత్రాల స్దాయిలో అయితే సినిమా లేదు.
ఇక ఫస్టాఫ్ బాగున్నా ,సెకండాఫ్ వర్కవుట్ కాలేదు. సెకండాఫ్ మొత్తం చాలా లాగ్ లతో , బాగా లెంగ్తీ సినిమా భారంగా చూస్తున్నట్లు అనిపించింది.చివరకు రొమాంటిక్ ట్రాక్ ఫస్టాఫ్ లో బాగున్నా ,సెకండాఫ్ కు వచ్చేసరికి నీరు కారిపోయింది. దర్శకుడు ఓ ప్రేమ కథను చెప్పాలని మొదలెట్టి ఓ జీవిత కథను చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చాడు. ముఖ్యంగా కథనం ఇంట్రస్టింగ్ గా లేదని అంటున్నారు. అప్పటికి విజయ్ దేవరకొండ, రష్మిక అద్బుతంగా నటించి సినిమాని పూర్తిగా మోసే ప్రయత్నం చేసారు. మైత్రీ మూవీస్ వారు కూడా బాగా ఖర్చు పెట్టారు. అయితే దర్శకుడు రియలిస్టిక్ గా సినిమాని మలచాలనే ఉద్దేశ్యంతో స్లో చేసేసారు. సినిమా ఓపినింగ్స్ అదిరిపోతాయి కానీ, అందుకు తగ్గట్లుగా సినిమా లేకపోవటం నిరాశపరిచే అంశమే అంటున్నారు.
పూర్తి రివ్యూ మరికొద్ది సేపట్లో…