‘డియర్ కామ్రేడ్’ పూర్తి కథ ఇదే

ఈ రోజు రిలీజ్‘డియర్ కామ్రేడ్’పూర్తి కథ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం‘డియర్ కామ్రేడ్’.నూతన దర్శకుడు భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. మరి కాసేట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్రాన్ని రిలీజ్ కు ముందే బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి కరణ్ జోహార్ రెడీ అవటంతో ఒక్క సారిగా క్రేజ్ రెట్టింపు అయ్యింది. అలాగే‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ సినిమాలో జోడిగా నటించడంతో ఈ సినిమాపై ఎక్సెపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి.

టాలీవుడ్‌లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కించిన ఈ చిత్రం షోలు ఇప్పటికే ఓవర్ సీస్ లో పడ్డాయి. అక్కడ నుంచి అందుతున్న సమాచారం మేరకు కథేంటో చూద్దాం.

బాబీ(విజయ్ దేవరకొండ) నిజాయితీగల ఓ స్టూడెంట్ లీడర్. గొప్ప నాయకత్వ లక్షణాలున్నా ఆవేశ‌ప‌రుడు కావటంతో ఇబ్బందులు పడుతూంటాడు. కాకినాడ కాలేజీలో చదువుకునే అతని ప్రక్కింటి పిల్ల లిల్లీ (ర‌ష్మిక‌). ఆమె స్టేట్ క్రికెట్ ప్లేయర్. తొలి చూపులోనే ఆమెను ఇష్టపడ్డ బాబి…ప్రపోజ్ చేస్తాడు. అయితే తనకు కెరీర్ పైనే దృష్టి అని రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ వెళ్తే ..అక్కడికి వెళ్లి తన ట్రాక్ లో తెచ్చుకోవాలని చూస్తాడు. అయితే ఈ లోగా బాబి ఓ పొలిటికల్ లీడర్ తో అయిన గొడవలో ఓ గూండా కోమాలోకి వెళ్లిపోతారు. బాబి తప్పు ఏమీ లేకపోయినా అందరూ అతన్నే బ్లేమ్ చేస్తారు. చివరకు లిల్లీ కూడా అతన్ని వదిలేసి ..బ్రేకప్ తరహాలో చెప్పి వెళ్లిపోతుంది.

నిరాశగా బాబి హిమాలయాలకు వెళ్లిపోయి అక్కడ వైల్డ్ లైఫ్ కోర్స్ లో చేరుతాడు. మూడేళ్లు గడిచాక ఓ రోజు ఓ హాస్పటిల్ లో లిల్లీ మళ్లీ కలుస్తుంది. ఈ సారి ఆమె డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకుంటుంది. విషయం తెలుసుకున్న బాబి ఆమెను తీసుకుని కేరళ వెళ్లి ..ఆ డిప్రెషన్ నుంచి బయిటపడేస్తాడు. ఈ సారి లిల్లీ…బాబికి ప్రపోజల్ పెడుతుంది. అయితే ముందు నువ్వు నీ కెరీర్ పై దృష్టి పెట్టు అంటాడు. ఆమె వినదు. దాంతో అసలేంటి …కారణం అని ఆమె ఫ్రెండ్స్ కు ఎంక్వైరీ చేస్తాడు. ఆ క్రమంలో ఆమె క్రికెట్ బోర్డ్ డైరక్టర్ తో కాస్టింగ్ కౌచ్ కు గురి అయ్యిందని, ఆమెను లైంగికంగా వేధించారని తెలుస్తుంది. అక్కడ నుంచి బాబి ఏం చేసాడు అనేది మిగతా కథ. బాబీ ఆవేశం, నిజాయితీ ఆ ఇద్ద‌రి ప్రేమ, కెరీర్ కు ఎలాంటి అడ్డంకులు సృష్టించాయి? ఈ క‌థ‌లో విల‌న్ ఎవ‌రు? అన్నిటినీ ఎదురొడ్డి చివ‌రికి ప్రేమ క‌థ‌ సుఖాంతం అయ్యిందా లేదా? అన్న‌దే ఈ సినిమా.