సౌత్ ఇండియాలోనే తొలి హీరో రౌడీ స్టార్!

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అర్జున్ రెడ్డి హిట్ తో రౌడీ స్టార్ పాన్ ఇండియా రేంజ్ కి చేరుకున్నాడు. సినిమా తెలుగులోనే విడుద‌లైన హిట్ పాన్ ఇండియాలో వెలిగిపోయింది. బాలీవుడ్, కోలీవుడ్ ల‌లో అర్జున్ రెడ్డి వేర్వేరు టైటిల్ తో రీమేక్ అవ్వ‌డం రౌడీ స్టార్ కి ఊహించ‌ని క్రేజ్ ని తీసుకొచ్చింది. ఆ తర్వాత గీత‌గోవిందంతో మ‌రో స‌క్సెస్ రౌడీ స్టార్ రేంజ్ నే మార్చేసింది. ఆ రెండు విజ‌యాలు విజ‌య్ ని టాలీవుడ్ లో టాప్ స్టార్ల‌ల‌లో ఒక‌డిగా కూర్చోబెట్టాయి. తాజాగా విజ‌య్ ఇన్ స్టాలో స‌రికొత్త రికార్డు సాధించాడు. 8 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుని సౌత్ లోనే తొలి హీరోగా నిలిచాడు.

విజ‌య్ 80 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్ ని క్రాస్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆయ‌న అభిమానులు పెద్ద పెండ‌గే చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా సెల‌బ్రేష‌న్స్ షురూ చేసారు. ఈ విష‌యంలో విజ‌య్ నిజంగా గ్రేట్ అనే అనాలి. ద‌శాబ్ధాలగా ఏ టాలీవుడ్ స్టార్ సాధించని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మ‌హేష్, రామ్ చ‌ర‌ణ్, బ‌న్నీ, ఎన్టీఆర్, ప్ర‌భాస్ ఇలా చాలా మంది స్టార్లు ఉన్నారు. కానీ ఏ హీరోకి రానంత ఫాలోయింగ్ విజ‌య్ కి ఇన్ స్టాలో ద‌క్క‌డం విశేష‌మే క‌దా. ఇక కోలీవుడ్ విజ‌య్ సినిమాల‌కు క్రేజ్ బాగానే ఉంది. అన‌తి కాలంలోనే అక్క‌డ విజ‌య్ సినిమాలు రిలీజ్ అవ్వ‌డం విశేషం. ప్ర‌స్తుతం రౌడీ స్టార్ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్` లో న‌టిస్తున్నాడు.

తెలుగు, హిందీ భాష‌ల్లో దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. కర‌ణ్ జోహార్, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఇది. పాన్ ఇండియా కేట‌గ‌రిలో చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో సక్సెస్ అయితే బాలీవుడ్ లో రౌడీస్టార్ ఇమేజ్ అంత‌కంత‌కు పెరిగిపోవ‌డం ఖాయం. ఇప్ప‌టికే క‌ర‌ణ్ జోహార్ త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో విజ‌య్ తో మ‌రో సినిమా కూడా ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఫైట‌ర్ త‌ర్వాత క‌ర‌ణ్ ప్రాజెక్ట్ లో న‌టించ‌నున్నాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.