విజయ్ దేవరకొండ, రష్మిక ముద్దు ముచ్చట
విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో ఆరాధించే అభిమానులను , వెంటపడే నిర్మాతలను సంపాదించుకున్నాడు . అతను నటించిన “పెళ్లి చూపులు” చిన్న చిత్రమైనా వ్యాపారపరంగా ఘాన విజయం సాధించింది . జాతీయ అవార్డు కూడా సంపాదించి విజయ్ మార్కెట్ ను అమాంతంగా పెంచింది . ఇక “అర్జున్ రెడ్డి “, “గీత గోవిందం” సినిమా అతనికి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది . అర్జున్ రెడ్డి , గీత గోవిందం సినిమాల్లో రొమాన్స్ , లిప్ లాక్ సన్నివేశాలు ప్రేక్షకులను కిర్రేకించాయి .
విజయ్ దేవరకొండ ఇప్పుడు పెద్ద స్టార్ . “డియర్ కామ్రేడ్ ” సినిమాలో విజయ్ , రష్మిక జంటగా నటిస్తున్నారు . ఈ ఇద్దరి మధ్య గీత గోవిందం సినిమా నుంచే సంథింగ్ సంథింగ్ ఉందని ఫిలిం సర్కిల్స్ లో చెవులు కొరుక్కుంటున్నారు . అందుకే రష్మిక చేసుకున్న ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుందని చెప్పుకుంటున్నారు . దీనిపై విజయ్ పక్కనుండగా కన్నడ జర్నలిస్టు మిత్రులు అడిగినా స్పందించలేదు .
డియర్ కామ్రేడ్ సినిమాకు విజయ్ స్వయంగా డ్రెస్ తానే డిజైన్ చేసుకున్నాడు . విజయ్ కాస్ట్యూమ్ కు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది . ఇది చూసిన విజయ్ ఇక మీద రష్మిక కు కూడా తానె డిజైన్ చేస్తానని చెప్పినట్టు తెలిసింది . అంటే ఈ ఇద్దరూ “డియర్ కామ్రేడ్ ” సినిమాతో మరింత సన్నిహితులైనట్టు చెప్పుకుంటున్నారు . పైగా డియర్ కామ్రేడ్ సినిమాలో ఈ ఇద్దరి మధ్య లిప్ లాక్ తో పాటు హాట్ హాట్ గా వున్న రొమాన్స్ సన్నివేశాలు “విజయ్ “పథంలో కి తీసుకుపోతాయట . ఈ సినిమా జులై 26న విడుదల కాబోతుంది .
ఇంతకీ విజయ్ , రష్మిక మధ్య వున్నా ఆ అనుబంధం … నిజమేనా ?