లిప్ లాక్ గురించి విజయ్ ఏమన్నాడంటే ?
మరో ఐదేళ్ల దాకా తాను బ్రహ్మచారిగానే ఉంటానని , ఆ తరువాతనే పెళ్లి చేసుకుంటానకి విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు విజయ్ , రష్మిక మందన్న నటించిన “డియర్ కామ్రేడ్ ” చిత్రం రేపు విడుదలవుతుంది . ఈ చిత్ర ప్రచారంలో పాల్గొన్న విజయ్ ను పెళ్లి గురించి అడిగారు . దానికి స్పందిస్తూ “ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు … మరో ఐదు సంవత్సరాలపాటు పెళ్లి గురించి ఆలోచించను
నా ద్రుష్టి అంతా ఇప్పుడు సినిమాలమీదనే ” అని చెప్పారు .
సినిమాల్లో ముద్దు ముచ్చట గురించి అడిగిన మరో ప్రశ్నకు జావాబిస్తూ .. “తెర మీద ముద్దు అదే లిప్ లాక్ సన్నివేశం వస్తే మీరు థియేటర్లో చూస్తూ కేరింతలు కొడతారు .. నిజానికి షూటింగ్ అనగానే యూనిట్ అంతా సెట్లో వుంటారు .. అంత మంది ద్రుష్టి మామీదనే ఉంటుంది . అలాంటి సందర్భంలో కిస్ చెయ్యడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి ” అన్నారు .
“ప్రస్తుతం నటన ఎంతో బాగుందని ఇకవేళ ఒకే మూస సినిమాలు వచ్చి బోర్ కొడితే మాత్రం నటనకు గుడ్ బై చెప్పి మారో దాంట్లోకి వెళ్ళిపోతాను , అందులో ఎలాంటి సందేహం లేదు “అని స్పష్టం చేశారు విజయ్ . అలాగే తన మీద రష్మిక మీదా ఏవేవో రాస్తున్నారు.. , చెప్పుకుంటున్నారు … అంటూ విజయ్ పుకార్ల గురించి ప్రస్తావించాడు .