రౌడీ హీరో కొత్త బిజినెస్ మొద‌లెట్టేశాడుగా!

Vijay Devarakonda

`అర్జున్‌రెడ్డి` సినిమాతో టాలీవుడ్‌లో స‌రికొత్త సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువుగా మారాడు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తెలుగు సినిమా గమ‌నాన్ని మార్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస విజ‌యాల‌తో క్రేజీ హీరోగా మారిపోయాడు. అన‌తి కాలంలోనే స్టార్ హీరోల‌కు స‌మానంగా స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకున్న ఈ సెన్సేష‌న‌ల్ హీరో గ‌త కొంత కాలంగా ఏది చేసినా సంచ‌ల‌న‌మే అవుతోంది. త‌న క్రేజ్‌నే రౌడీ బ్రాండ్‌గా క్రియేట్ చేసుకుని కొత్త  బ్రాండింగ్‌ని మొద‌లుపెట్టి యంగ్ హీరోల్లో సంచ‌ల‌నం సృష్టించాడు.  

రౌడీ బ్రాండ్‌తో టాలీవుడ్‌లో స‌రికొత్త బ్రాండ్‌కి నాంది ప‌లికిన విజ‌య్‌ని ఆ త‌రువాత చాలా మంది తెలుగు హీరోలు ఫాలో అవుతున్నారు. ఎవ‌రినీ ఫాలో అవ్వ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా స్టార్ హీరోలు మ‌హేష్‌, ప్ర‌భాస్‌ల‌ని ఫాలోఅవుతున్నాడటం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌హేష్‌, ప్ర‌భాస్ మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట‌ర‌య్యారు. వారి త‌ర‌హాలోనే రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట‌ర‌వుతున్నారు.

డిస్ట్రిబ్యూషన్ రంగంతో పాటు ఎగ్జిబిట‌ర్స్ రంగంలో అగ్ర భాగాన నిలిచిన ఏషియ‌న్ సినిమాస్‌తో క‌లిసి విజ‌య్ మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ స్వ‌గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చం పేట‌. అందుకే విజ‌య్ త‌న హోమ్ టౌన్ అయిన మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఈ మల్టి ప్లెక్స్ ని నిర్మిస్తున్న‌ట్టు తెలిసింది. `ఏ వి డి` పేరుతొ మూడు స్క్రీన్స్ ఉన్న మల్టి ప్లేక్స్ నిర్మాణం జ‌రుగుతోంద‌ని,  వచ్చే వేస‌వికల్లా దాన్ని పూర్తీ చేయాలన్న పనుల్లో బిజీగా ఉన్నార‌ట‌. విజయ్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం నటిస్తున్న `వరల్డ్ ఫేమస్ లవర్` , ఫైట‌ర్ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఇందులో `వరల్డ్ ఫేమస్ లవర్` ఫిబ్ర‌వ‌రి 14న విడుదల కానుంది. పూరితో చేయ‌బోతున్న‌`ఫైటర్` ఈ నెల‌లోనే మొద‌లు కాబోతోంది.

Vijay Devarakonda is getting into Multiplex Business. Vijay Devarakonda is Partnering with Asian cinemas in setting up a 3 screen multiplex by name AVD.