Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోలు అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ఇద్దరి హీరోలు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమాలో నటించబోతున్నాడు. మరోవైపు రాజమౌళి మహేష్ బాబుతో కలిసి ఒక పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అలా ఇద్దరు హీరోలు ఒకవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు వరస సినిమాలలో నటిస్తూ అలాగే బిజినెస్ రంగంలో కూడా రాణిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా మహేష్ అల్లు అర్జున్ ఇప్పటికే మల్టీప్లెక్స్ నిర్మాణంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే ఏషియన్ గ్రూప్స్ భాగస్వామ్యంతో వారు ఈ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్‌లోనే అత్యంత విలాసవంతమై మల్టీప్లెక్స్ ను మహేశ్ బాబు నిర్మించగా,AAA పేరుతో అల్లు అర్జున్ రీసెంట్ గా ఈ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఇతర రాష్ట్రాల్లో కూడా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది.
AMB పేరుతో బెంగళూరులో ఒక భారీ మల్టీప్లెక్స్ ను మహేశ్ నిర్మించారు. త్వరలో ఇది ప్రారంభం కానుంది. ఆరు స్క్రీన్స్ తో అత్యంత లగ్జరీ సౌకర్యాలతో దీనిని నిర్మించారు. ఇప్పుడు చెన్నైలో కూడా మరో మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఏషియన్ సినిమాస్ తో కలిసి అక్కడ అతిపెద్ద థియేటర్ ను నిర్మించాలని ప్రిన్స్ మహేశ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే విషయాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తన సన్నిహితుల వద్ద చెప్పారట. అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాదులోని అమీర్ పేట్ లో ఒక మల్టీప్లెక్స్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీ వైజాగ్ లో AAA మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ లో త్వరలో ప్రారంభం కానున్న ఇనార్బిట్ మాల్ లో హైదరాబాద్ లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ కట్టిస్తున్నారట. ఇదే విషయాన్ని సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారు. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. హైదరాబాద్ లో అతిపెద్ద ఐమాక్స్ థియేటర్ కూడా త్వరలో నిర్మించనున్నట్లు ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ చెప్పారట.