పాపం విజయ్ దేవరకొండ బెంగ పెట్టుకున్నాడు .. ఎవరి గురించి అసలేమైంది ?

vijay devarakonda is not happy with his brother anand cine career

విజయ్ దేవరకొండ… ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హోదాను అనుభవిస్తున్నాడు. బాలీవుడ్ లో కూడా బోలెడు అవకాశాలు వస్తున్నాయి. విజయ్ ఊ.. అంటే చాలు.. ఆయనతో సినిమా తీయడానికి బాలీవుడ్ డైరెక్టర్లు కూడా లైన్ లో ఉన్నారు. విజయ్ కి కూడా దేశవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. తన సినీ కెరీర్ కు ఎటువంటి సమస్యా లేదు. ఇంత స్టార్ హోదాను అనుభవిస్తున్నప్పటికీ.. విజయ్ ని ఓ విషయం తీవ్రంగా బాధిస్తోంది. విజయ్ ని అంతలా టెన్షన్ పెట్టిస్తున్న ఆ విషయం ఏంటో తెలుసుకుందాం పదండి..

vijay devarakonda is not happy with his brother anand cine career
vijay devarakonda is not happy with his brother anand cine career

విజయ్ కి తమ్ముడు ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ.. తొలిసారిగా దొరసాని అనే సినిమాలో నటించాడు. హీరోగా డెబ్యూ మూవీ వచ్చినప్పటికీ.. ఆ సినిమా ప్రేక్షకులను అంతలా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ అడియాశలయ్యాయి. తన తమ్ముడిని ఎలాగైనా హీరో చేయాలని.. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకునేలా చేయాలని చాలా తపిస్తున్నాడు.

అందుకే.. వెంటనే కింగ్ ఆఫ్ ది హిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌజును స్టార్ట్ చేశాడు విజయ్. ప్రొడ్యూసర్ గా మారాడు. తన సొంత బ్యానర్ పై నేను మీకు చెప్తా.. అనే సినిమా కూడా తీశాడు. ఇప్పటికే ఆనంద్ కు మరో చాన్స్ వచ్చింది. మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాను ఆనంద్ ప్రకటించినప్పటికీ.. ఆనంద్ ను హీరోగా నిలదొక్కుకునే స్క్రిప్ట్ కోసం విజయ్ ఆరాటపడుతున్నాడు.

అందుకే ఆనంద్ కోసం ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నాడట విజయ్. ఎలాగూ రాబోయే కాలమంతా వెబ్ సిరీస్ లదే కాబట్టి… బ్రహ్మాండమైన వెబ్ సిరీస్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడట. ప్రస్తుతం కరోనాతో సినీ ఇండస్ట్రీ దెబ్బతిన్న సంగతి తెలుసు కదా. కొంచెం పరిస్థితులు చక్కదిద్దుకున్నాక… తమ్ముడితో వెబ్ సిరీస్ ను చిత్రీకరిస్తాడట. ఈ వెబ్ సిరీస్ దర్శకత్వ బాధ్యతలను సందీప్ రెడ్డి లేదా కేవీఆర్ మహేంద్రకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి తమ్ముడిని ఇండస్ట్రీలో సెట్ చేయడం కోసం విజయ్ దేవరకొండ బాగానే కష్టపడుతున్నాడంటూ సినీ ఇండస్ట్రీ కోడై కూస్తోంది.