ఒక హీరో ఇమేజ్ ని డ్యామేజ్ చెయ్యాలన్నా దాన్ని ఓ రేంజ్ లో నిలబెట్టాలి అన్నా అది ఆ సినిమా దర్శకుడు వల్లే అవుతుంది. అయితే కొందరు హీరోలు అత్యుత్సాహంతో సినిమాలు ఓ దర్శకునితో ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చేసేస్తారు. ఒకోసారి అవే భారీ దెబ్బ తీస్తాయి.
ఇప్పుడు అదేలా మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయంలో జరిగిందని చెప్పాలి. దర్శకుడు పూరి జగన్నాథ్ అప్పుడే ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చాడు. దీనితో “లైగర్” అనే సినిమా స్టార్ట్ చేసి రిలీజ్ నట వరకు సెన్సేషనల్ హైప్ ని తెచ్చుకున్నారు.
దీనితో ఈ భారీ ఓపెనింగ్స్ కూడా రాబట్టింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. అయితే ఈ ఎఫెక్ట్ తో విజయ్ ఇప్పుడు పూరి జగన్నాథ్ కి భారీ షాకిచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబో నుంచే ఓ భారీ పాన్ ఇండియా సినిమా “జనగణమణ” అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందట. బడ్జెట్ వల్ల సినిమా వద్దు అని విజయ్ అంటున్నాడని టాక్ ఉంది కానీ లైగర్ దెబ్బ తోనే మళ్ళీ పూరి తో సినిమా చెయ్యకూడదు అనే విజయ్ డిసైడ్ అయ్యాడని అందుకే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ఇప్పుడు సినీ వర్గాల్లో సమాచారం కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అయితే విజయ్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.