అక్కడ మాసివ్ రెస్పాన్స్ చూసి విజయ్ దేవరకొండ ఆశ్చర్యపోయాడట..!

రీసెంట్ గా భారీ అంచనాలు ఉన్నటువంటి పలు పాన్ ఇండియా చిత్రాల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్ మరియు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న భారీ ఏక్షన్ ఫిల్మ్ “లైగర్” కూడా ఒకటి.

మరి ట్రైలర్ తో ఎక్కడికో వెళ్ళిపోయిన ఈ సినిమా పై అంచనాలు ఇప్పుడు అదిరే ప్రమోషన్స్ ని పాన్ ఇండియా లెవెల్లో చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి ముంబై లో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన తాను ఎనర్జిటిక్ గా ఈ ఈవెంట్ ని సక్సెస్ చేసాడు.

అయితే ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కి అక్కడకి వెళ్లిన విజయ్ దేవరకొండ అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాన్ని తాను పంచుకున్నాడు. తాను ఇప్పటి వరకు కొన్ని సార్లు మాత్రం ఒక వండర్ లా ఫీల్ అయ్యానని అలాగే ముంబై లో తనకి వచ్చిన రెస్పాన్స్ మళ్ళీ అలా ఆశ్చర్యపోయానని తాను తెలిపాడు.

ముంబై ఇచ్చిన లవ్ అండ్ ఎగ్జైట్మెంట్ ని ఎప్పటికీ మర్చిపోలేనని విజయ్ తెలిపాడు. అంతే కాకుండా తమ కోసం వచ్చిన రణ్వీర్ సింగ్ కి తాను స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ, హాలీవుడ్ మైక్ టైసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఈ ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతుంది.