(సూర్యం)
‘అర్జున్‌రెడ్డి’తో ఒక్కసారిగా పాపులర్ అయి, ‘గీత గోవిందం’తో యూత్ ఐకాన్ గా మారిన హీరో విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెహరీన్ హీరోయిన్. ఈ చిత్రం ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగా…
తనకు నచ్చిన ముఖ్యమంత్రి గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…..చిన్నప్పుడు చంద్రబాబునాయుడి నాయకత్వం అంటే ఇష్టంగా ఉండేది. ఆయన హయాంలోనే ప్రభుత్వోద్యోగులు చాలా హడావుడి పడటం చూసేవాణ్ని. సమయానికి రావాలనే హడావుడి కార్యాలయాల్లో ఆయన హయాంలోనే గమనించేవాణ్ని. అలా స్ట్రిక్ట్‌గా ఉంటే నాకు ఇష్టం.
ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ పాలన నాకు బాగా నచ్చింది. కేటీఆర్‌ని కలిసిన తర్వాత ఆయన ఆలోచనలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. నాయకులు కెమెరాల ముందు చెప్పినట్టు కాకుండా, మా ఇంట్లో కూడా ఆయన ‘విజయ్ చిత్రీకరణల్లో ప్లాస్టిక్‌ని వినియోగించొద్దు. రాగి వస్తువులు కొనుక్కుని వాటితో నీళ్లు తాగు, మంచిది. నువ్వు యాక్టర్‌వి కదా. ఖాదీ వస్త్రాల్ని ప్రమోట్ చేయొచ్చు కదా’ అని చెప్పారు.