రౌడీ `హీరో` వ‌ర్సెస్ త‌మిళ‌ `హీరో

`హీరో`లో విల‌న్ ఎవ‌రు?

`యాథృచ్ఛిక‌మే అయినా సౌత్ లో ఒకేసారి ఒకే టైటిల్ తో రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లాయి. ఒక‌టి విజ‌య్ దేవ‌ర‌కొండ నటిస్తున్న సినిమా కాగా.. మ‌రొక‌టి త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ న‌టిస్తున్న సినిమా. ఈ రెండిటి టైటిల్ `హీరో`. ఇక ఈ రెండు సినిమాల్లో టైటిల్ కి త‌గ్గ‌ట్టే క‌థానాయ‌కుల పాత్ర‌లు చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయ‌ట‌. హీరో పాత్ర‌కు ధీటుగా విల‌న్ పాత్ర‌లు ర‌క్తి క‌ట్టించ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది.
 
దేవ‌ర‌కొండ న‌టిస్తున్న `హీరో` చిత్రంలో బైక్ ఛేజ్ లు ఛాలెంజ్ లు ఉర‌క‌లెత్తించ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. హీరో ఒక బైక్ రేసర్ కావ‌డంతో రేస్ ట్రాక్ పై సాహ‌సాల్ని అదిరిపోయే లెవ‌ల్లో ప్లాన్ చేశారు. అందులో విల‌న్ పాత్ర‌కు అంతే ప్రాధాన్య‌త ఉంది. ఇక ఇప్ప‌టికే హీరో చిత్రం కోసం దేవ‌ర‌కొండ దిల్లీ లో రేసింగ్ లో శిక్ష‌ణ పొందాడు. అక్క‌డ కీల‌క‌మైన షెడ్యూల్ ని తెర‌కెక్కించ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు ఆనంద్ అన్న‌మ‌లై ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  మాళ‌విక మోహ‌న‌న్ నాయిక‌. తెలుగు- త‌మిళం- హిందీలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 
 
మ‌రోవైపు శివకార్తికేయన్  న‌టిస్తున్న `హీరో` చిత్రానికి సంబంధించిన కాస్టింగ్ డీటెయిల్స్ హీటెక్కిస్తున్నాయి.  `అభిమన్యుడు` ఫేమ్‌ పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అభ‌య్ డియోల్ విల‌న్ గా న‌టిస్తున్నార‌ట‌. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ క‌థానాయిక‌. యువ‌న్ శంక‌ర్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు అక్ష‌య్.. న‌వాజుద్దీన్.. నీల్ నితిన్ వంటి వాళ్లు  సౌత్ లో విల‌న్లు అయ్యారు. వీళ్ల బాట‌లోనే అభ‌య్ డియోల్ విల‌న్ గా మారాడు.