AR Murugadoss: డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ గురించి మనందరికీ తెలిసిందే. గజిని సినిమాతో ఒక్కసారిగా అందరినీ తన వైపు చూసేలా చేసుకున్నారు ఈ డైరెక్టర్. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో పాటు ఆ తరువాత తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇకపోతే ఇటీవలే ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన మూవీ మదరాసి. తమిళ స్టార్ శివకార్తికేయన్ ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి పరవాలేదు అనిపించుకుంది. ఇకపోతే ఈ సినిమా తరువాత మురుగదాస్ చేయబోయే సినిమా గురించి ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేమిటంటే మురుగదాస్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. 2017 భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా తరువాత నుంచే మురుగదాస్ హిట్ దూరం అయ్యింది. అయితే ఆ సినిమా విడుదల సమయంలోనే మహేష్ బాబుతో మరో సినిమా చేసి సూపర్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట మురుగదాస్.
The latest reports from the Tamil media reveal that #ARMURUGADOSS & #SIVAKARTHIKEYAN are planning to collaborate once again.
Reportedly, Murugadoss narrated an interesting subject to Sivakarthikeyan during the shoot of #Madharaasi. pic.twitter.com/jpkKfEXYUg
— MOHIT_R.C (@Mohit_RC_91) September 16, 2025
దానికి మహేష్ బాబు కూడా ఒకే చెప్పారట. ఈ నేపధ్యంలోనే తాజాగా మహేష్ బాబు ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ని రెడీ చేశాడట ఈ దర్శకుడు. కాకపోతే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవడానికి మరో సంవత్సరమైనా పట్టె అవకాశం ఉంది. పోనీ ఆ సినిమా విడుదల వరకు ఆగుదాం అంటే, ఆ రేంజ్ సినిమా తరువాత మహేష్ మురుగదాస్ తో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా అనేది మరో డౌట్. అందుకే మహేష్ కోసం రాసుకున్న కథను ఇటీవల మదరాసి సినిమాతో తణుకు డీసెంట్ హిట్ అందించిన శివ కార్తికేయన్ కి వినిపించాడట. ఆ కథ విపరీతంగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈ వార్త తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
