(సూర్యం)
‘మెంటల్ మదిలో’, ‘నీది నాది ఒకే కథ’ వంటి చిత్రాల్లో సోలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇంతకాలం పక్కింటబ్బాయి తరహా పాత్రల్లోనే మెరిసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు ‘వీర భోగ వసంత రాయలు’ గా ఈ రోజు సరికొత్త లుక్‌లో అలరించాలని థియోటర్స్ కు వచ్చాడు.
దేశంలో జరుగుతోన్న ఆరాచకాల నేపథ్యంలో సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా రూపొందింది. ఈ సినిమా ప్రధానంగా మూడు క్రైమ్ లకు సంబంధించిన కథగా సాగుతుం ది. క్రికెటర్స్ తో పాటు చాలా మంది ప్రముఖులు ప్రయాణిస్తున్న ఓ విమానం హైజాక్‌కు గురవుతుంది. అలాగే సిటీలో వరుసగా అనాథ పిల్లల కిడ్నాప్‌లు అవుతూంటాయి. మూడో కేసులో ఓ కుర్రాడు తన ఇళ్లు ఎక్కడో
తప్పిపోయిందంటూ పోలీసు కంప్లయింట్ ఇస్తాడు. ఈ మూడు కేసులుకు ఓ లింక్ ఉంటుంది. అదే శ్రీవిష్ణు. ఆ లింక్ ఏంటి…అసలు కథేంటి అనేది రివ్యూలో చదవండి.
ఇక ఈ సినిమా టాక్ విషయానికి వస్తే చాలా దారుణంగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాలో అసలు గ్రిప్పింగ్ అనేది లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే నారా రోహిత్, శ్రియ పాత్రలు చాలా చిన్నవని ,సుధీర్ బాబు పాత్ర సినిమా అంతా ఉన్నా డబ్బింగ్ వేరే వారిది కావటం మైనస్ అయ్యిందని వినిపిస్తోంది. శ్రీ విష్ణుకు కూడా ఈ సినిమా కలిసివచ్చేదేమీ కాదని, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తేలిపోయాడని చెప్తున్నారు. సినిమా ఆడటం కష్టమే అని తెలుస్తోంది.
ఇక కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒకే తరహా హెయిర్ స్టైల్‌తో కనిపించిన శ్రీవిష్ణు.. ‘వీర భోగ వసంత రాయలు’ సినిమాకోసం.. స్టైలిష్ హెయిర్ కట్తో..
సిక్స్ ప్యాక్ బాడీతో ఒళ్లంతా టాటూలు వేసుకుని డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు.