వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ .. రౌడీలో అంత ద‌మ్ముందా?

vd9 title

ఛాలెంజింగ్ టైటిల్ వెన‌క క‌థేంటి?

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్.రామారావు, కె.ఎ.వ‌ల్ల‌భ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సినిమాకి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అనే ఛాలెంజింగ్ టైటిల్ ని ఎంపిక చేసుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి యూనివ‌ర్శ‌ల్ క‌నెక్టివిటీతో పాన్ ఇండియా అప్పీల్ తేవాల‌న్న ప్లాన్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో పాటు విజ‌య‌ద్ దేవ‌ర‌కొండ మైండ్ లో ఉంద‌ని తెలుస్తోంది. అందుకే ఈసారి మెగా నిర్మాత‌ కె.ఎస్.రామారావు మార్క్ లో కాకుండా .. ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ శైలిలో కాకుండా ఈ టైటిల్ కొంచెం కొత్త‌గానే క‌నిపిస్తోంది.

న‌లుగురు భామ‌ల‌తో రౌడీగారి ల‌వ్ స్టోరీనా?

మొత్తానికి టైటిల్ ఓకే. దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ఈ తొమ్మిదో సినిమా అత‌డికి ఎలాంటి విజ‌యాన్ని అందించ‌నుంది అన్న‌ది స‌స్పెన్స్. ఇటీవ‌లే డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో ఫ్లాప్ ని అందుకున్న దేవ‌ర‌కొండ‌కు కెరీర్ 9వ సినిమా ఎలాంటి అనుభూతిని మిగ‌ల్చ‌బోతోంది అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్‌, క్యాథరిన్‌, ఇజబెల్లి త‌దిత‌రులు నటిస్తున్నారు. ఈ సినిమా ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరి. న‌లుగురు భామ‌ల‌తో రౌడీగారి ల‌వ్ స్టోరీనా? అన్న స‌స్పెన్స్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. యువ‌త‌రానికి క‌నెక్టివిటీ ఉంటుంద‌ట‌. అందుకే చాలా జాగ్ర‌త్త‌గా టైటిల్ ని ఎంపిక చేసుకున్నార‌ని తెలుస్తోంది. కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, జ‌య‌కృష్ణ గుమ్మ‌డి త‌దిత‌రులు సాంకేతిక వ‌ర్గంలో అద‌న‌పు అస్సెట్ కానున్నారు.