సుకుమార్ – విజయ్ దేవరకొండ సినిమా షాకింగ్ అప్‌డేట్… ఈ గ్యాప్ చాలా ఎక్కువ..?

సుకుమార్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అందరికీ ఒకటే ఆలోచన. సుకుమార్ విజయ్ దేవరకొండ ని ఎలా చూపించబోతున్నాడు అని. ఎందుకంటే సుకుమార్ ఒక్కో సినిమాకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడు రిపీటెడ్ గా ఒకే జోనర్ లో సినిమాలు చేయడు. అందుకు ఉదాహరణ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో.. రాం చరణ్ తో చేసిన రంగస్థలం సినిమాలే. రెండు భిన్నమైన కథలు. రెండు సినిమాలలో ఇద్దరు హీరోలని ఎంతో వేరియేషన్ తో చూపించాడు.

ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా ఇలాగే ఊర మాస్ గేటప్ లో చూపిస్తున్నాడు. ఇంతకాలం అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అన్న పేరు తగ్గట్టే అల్ట్రా మోడ్రన్ స్టైలిష్ క్యారెక్టర్స్ లోనే చూశాము. కాని అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ టైం కంప్లీట్ మాస్ రోల్ లో కనిపిస్తున్నాడు. సుకుమార్ అల్లు అర్జున్ మోకోవర్ మొత్తాని మార్చేశాడు. నిజంగా లారీ డ్రైవర్ లు ఎలా ఉంటారో అలానే అల్లు అర్జున్ మోకోవర్ చేశాడు. ప్రస్తుతం పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత వెంటనే సుకుమార్ – విజయ్ దేవరకొండ సినిమా సెట్స్ మీదకి వస్తుందనుకున్నారు. కాని ఇంకా సుకుమార్ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రెడీ చేయలేదట. పుష్ప రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ సినిమా వర్క్ ని మొదలు పెడతాడని .. ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చేది 2022 లోనే అని సమాచారం. ఈ లోపు విజయ్ దేవరకొండ లైగర్ కంప్లీట్ చేసి మరో ప్రాజెక్ట్ చేస్తాడా లేక సుకుమార్ కోసం వేయిట్ చేస్తాడా చూడాలి.