తన పెళ్లి గాసిప్స్ పై అదిరే రిప్లై ఇచ్చిన “వకీల్ సాబ్” ఫేమ్ అనన్య.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాల్లో తన లేటెస్ట్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్” కోసం అందరికీ తెలిసిందే. దాదాపు మూడున్నరేళ్లు తర్వాత పవన్ చేసిన సినిమా ఇది. అయితే ఇది రీమేక్ అయినప్పటికీ కూడా మంచి వసూళ్లు ఈ చిత్రం అందుకుంది.

మరి ఈ సినిమాలో పవన్ తో పాటుగా సినిమా అంతా ట్రావెల్ అయ్యే అమ్మాయిలుగా కొందరు యంగ్ టాలెంట్ నటీమణులు కనిపిస్తారు. మరి ఆ ఆర్టిస్టుల్లో గ్లామరస్ నటి అనన్య నాగళ్ళ కూడా ఒకామె. అయితే అనన్య ఈ సినిమాలో డీ గ్లామ్ గా కనిపించినా ఈ సినిమా రిలీజ్ తర్వాత అయితే భారీ ఫేమ్ ఈమెకి వచ్చింది.

దీనితో ఈమె మంచి  లేటెస్ట్ గా అయితే ఈమెపై కొన్ని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఈమె పెళ్ళికి రెడీ అయ్యింది అని త్వరలోనే జరిగిపోతుంది అని కొన్ని గాసిప్స్ స్టార్ట్ కాగా వాటిపై ఈమె అదిరే రిప్లై లేటెస్ట్ గా ఇచ్చింది. రివర్స్ లో తానే థాంక్స్ చెప్తూ నాకు పెళ్ళి కొడుకుని సెలెక్ట్ చేసిన వారికి థాంక్స్ చెప్తున్నానని.. 

అతనెవరో నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తానని అలాగే డేట్ టైం కూడా చెప్తే నా పెళ్ళికి నేనే వస్తానని అనన్య క్రేజీ రిప్లై ఇచ్చింది. దీనితో తన రూమర్స్ పై తాను ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది.