`వీ` క‌థ మొత్తం లీక్.. ఇలా అయితే క‌ష్ట‌మే!!

                        పున‌ర్జ‌న్మ‌లు.. ద్విపాత్ర‌ల‌‌తో ఊహాతీత‌మైన‌ ట్విస్టులు

పున‌ర్జ‌న్మ‌ల్ని ట‌చ్ చేస్తేనే బంప‌ర్ హిట్టు. ఆ క‌థ‌ల్లోనే ఏదో తెలీని గ‌మ్మ‌త్తు విశేషంగా ఆక‌ర్షిస్తుంది. ఆ సంగ‌తిని గ‌తంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఇండ‌స్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్ `మ‌గ‌ధీర` కు పున‌ర్జ‌న్మ‌ల క‌థాంశం పెద్ద ప్ల‌స్. రాజ‌మౌళి- రామ్ చ‌ర‌ణ్ ఫేట్ మార్చేసిన చిత్ర‌మిది. అంత‌కుముందు క్లాసిక్ డేస్ లోనూ టాలీవుడ్ లో ఇలాంటి క‌థాంశాల‌తో ఎన్నో సినిమాలొచ్చాయి. ఇటీవ‌లే అక్ష‌య్ కుమార్ –  పూజా హెగ్డే త‌దిత‌రులు న‌టించిన పున‌ర్జ‌న్మ‌ల కాన్సెప్ట్ మూవీ `హౌస్ ఫుల్ 4` కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద బాగానే వ‌సూళ్లు సాధించింది.

ఇప్పుడు అదే కోవ‌లో మ‌రో సినిమా టాలీవుడ్ లో పున‌ర్జ‌న్మ‌ల బ్యాక్ డ్రాప్ తో ర‌క్తి క‌ట్టించ‌నుందిట‌. ఇంత‌కీ ఏదా మూవీ అంటే?   నానీ- సుధీర్ బాబు క‌థానాయ‌కులుగా ఇంద్ర‌గంటి తెర‌కెక్కిస్తున్న `వీ`లో ఇలాంటి ట్విస్టు ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలుస్తోంది.

పున‌ర్జ‌న్మ‌ల్లోనూ ర‌క‌ర‌కాల ట్విస్టులు ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. ఒక జన్మలో నాని విలన్ అయితే మరో జన్మలో సుధీర్ బాబు విలన్..! ఇద్దరు హీరోలు..! ఇద్దరు విలన్లు..! ఇదే వీ కథలో అస‌లు ట్విస్ట్. థ్రిల్లర్ నేపథ్యంలో మూవీ ఇప్ప‌టికే రెడీ అయ్యింది. మరి క‌రోనా క్రైసిస్ రాకపోయి ఉంటే ఈపాటికే ఈ మూవీని జనాలు చూసేవారు. మరి లేట్ అయ్యింది. ఇప్పుడు ఈ త‌ర‌హా కాన్సెప్ట్ అంటే కష్టమేన‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నా.. రిలీజ్ కి వ‌స్తే కానీ ఏదీ తెలీదు. ఇప్ప‌ట్లో థియేట‌ర్ల‌కు రావ‌డం క‌ష్ట‌మే కాబ‌ట్టి `వీ`ని దిల్ రాజు బృందం ఓటీటీలో రిలీజ్ చేస్తారా?  లేక వేచి చూస్తారా? అన్న‌ది వేచి చూడాలి.