Sandeep Reddy Vanga: తెలుగు సినీ ప్రేక్షకులకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యానిమల్ సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. యానిమల్ సినిమా తర్వాత ఇప్పుడు ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా మూవీ స్పిరిట్ అనే ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో కలిసి ఈ సినిమా తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి అని చెప్పాలి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కొక్క వార్త సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇకపోతే ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించి గత కొన్ని రోజులుగా అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను తీసుకున్నారని, కానీ అనుహ్యంగా ఆమెను తప్పించి ఆ స్థానంలోకి మరో హీరోయిన్ ను తీసుకున్నారంటూ ప్రచారం నడిచింది. ఈ క్రమంలో స్పిరిట్ చిత్రంలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రీ అంటూ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
https://x.com/imvangasandeep/status/1927064054515867817?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1927064054515867817%7Ctwgr%5Efa14429868cfefca57022e956dbb80b92e78dfed%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fdirector-sandeep-reddy-vanga-slams-actors-dirty-pr-games-amid-spirit-movie-story-leak-rumours-1545051.html
అయితే తాజాగా స్పిరిట్ మూవీ స్టోరీని దీపికా పీఆర్ టీమ్ లీక్ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ డైరెక్టర్ సందీప్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు సందీప్ రెడ్డి. మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం కదిలించలేరని, స్టోరీ మొత్తం లీక్ చేసినా నాకేం ఫరఖ్ పడదంటూ పరొక్షంగానే వార్నింగ్ ఇచ్చేశారు. ఇదేనా మీ ఫెమినిజం? అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నేను ఒక నటికి స్టోరీని చెప్పినప్పుడు ఆమెపై వందశాతం నమ్మకంతో చెబుతాను. మా మధ్య నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ మీరు ఇలాంటి వ్యవహారాలు చేసి మీది మీరే బయట పెట్టుకుంటున్నారు. ఒక యంగ్ నటిని కిందకు లాగడం ఆమెను విమర్శించడం నా స్టోరీని లీక్ చేయడం.. ఇదేనా మీ ఫెమినిజం ? నేను ఒక ఫిల్మ్ మేకర్ లో ఒక సినిమా కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతుంటాం. నాకు సినిమానే ప్రపంచం. మీకు ఇది అర్థం కాదు. ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా. ఈ సారి స్టోరీ మొత్తం లీక్ చేయండి. నాకేం ఫరక్ పడదు అంటూ ట్వీట్ చేశారు సందీప్ రెడ్డి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.