‎Viswambhara: విశ్వంభర మూవీ స్టోరీ లైన్ లీక్ చేసిన డైరెక్టర్.. 14 లోకాలు ఉంటాయంటూ!

‎Viswambhara: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీనియర్ హీరో అయిన మెగాస్టార్ ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి నటించిన సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర.

‎ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కాగా విశ్వంభర స్టోరీపై ఇప్పటికే ఎన్నోసార్లు రూమర్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వాటికి చెక్‌ పెడుతూ దర్శకుడు వశిష్ఠ దీని స్టోరీ లైన్ చెప్పేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. పైన 7, కింద 7 ఉంటాయి. ఇప్పటి వరకూ ఈ 14 లోకాలను ఎవరికి తోచినవిధంగా వాళ్లు చూపించారు.

‎ యమలోకం, స్వర్గ, పాతాళలోకం ఇలా అన్నిటినీ చూశాను. కానీ విశ్వంభర మూవీలో నేను వీటన్నిటినీ దాటి పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని ఇందులో చూపించాను. ఈ 14 లోకాలకు అదే బేస్‌. హీరో డైరెక్ట్‌గా ఆ లోకానికి ఎలా వెళ్తాడు? హీరోయిన్‌ ను ఎలా తిరిగి తెచ్చుకుంటాడు? అనేదే ఈ సినిమా కథ అని దర్శకుడు వివరించారు. కాగా ఈ సందర్భంగా డైరెక్టర్ వశిష్ట చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరితో పాటు నాగిని సీరియల్‌ తో ఆకట్టుకున్న నటి మౌనీరాయ్‌ తోనూ చిరు స్టెపులు వేయనున్నట్లు సమాచారం.