నివేదా థామస్ కి ఈసారి నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అంటున్నారు ..?

నివేదా థామస్ ఇప్పుడు కొన్ని సినిమాలకి బెస్ట్ ఛాయిస్ అన్న క్రేజ్ ని సంపాదించుకుంది. ఒక వైపు హీరోలకి జంటగా నటిస్తూనే మరోవైపు సీనియర్ స్టార్ హిరోల సినిమాలలో కూతురు పాత్రలకి కమిటవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. సినిమా రిజల్ట్ విషయం పక్కన పెడితే రజనికాంత్ సినిమాలో నటించే అవకాశం అందుకోవడం గొప్ప విషయం అని చెప్పాలి.

Pawan Kalyan looks intense as lawyer in 'Vakeel Saab' motion poster; check  out

ఇక రీసెంట్ గా తెలుగులో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన వి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా తన పాత్రకి ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటుంది. గ్లామర్ పాత్రలకి ముందు నుంచి దూరంగా ఉంటూ వస్తున్న నివేదా కి తనకి తగ్గట్టే అవకాశాలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషిస్తుంది నివేదా థామస్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ అంతగా హైలెట్ అయ్యే పాత్ర నివేదా దే. నేచురల్ పర్ఫార్మెన్స్ తో నివేదా ఎలా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే. అలాగే వకీల్ సాబ్ లో కూడా నివేదా అద్భుతంగా నటించిందని అంటున్నారు.

ముఖ్యంగా క్లైమాక్స్ లో నివేదా పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ కంటతడి పెడతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఖచ్చితంగా వకీల్ సాబ్ తో నివేదా కి ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ రావడం పక్కా అన్న మాట వినిపిస్తుందట. అదే గనక జరిగితే పవర్ స్టార్ తో నటించడం మొదటిసారి .. అలాగే నేషనల్ అవార్డ్ దక్కితే నివేదా జీవితంలో వకీల్ సాబ్ ప్రత్యేకంగా నిలిచిపోతుందని అంటున్నారు. చూడాలి మరి నివేదా వకీల్ సాబ్ తో ఎలాంటి ఫీడ్ బ్యాక్ అందుకుంటుందో.