చిత్రం సినిమాతో కెరీర్ మొదలు పెట్టి ఒక దశలో కెరీర్‌లో తారాస్థాయికి జువ్వలా దూసుకెళ్లాడు. ఆ తరువాత అంతే స్పీడుతో కిందకు వచ్చాడు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ఆత్మహత్యతో ముగించాడు. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే దశలో అప్పుడు అతని కెరీర్ నిజానికి గందరగోళంగా ఉంది. ఒక్క హిట్టూ లేదు. కొత్త సినిమా చాన్సులూ రాలేదు. దీంతో అవి అతన్ని తీవ్ర వేదనకు గురిచేశాయి. ఆ తరువాత అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్న కారణాలను ప్రముఖ దర్శకుడు తేజ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉదయ్ కిరణ్ చాలా మంచివాడని.. అమాయకుడని తేజ అన్నారు. ఇండస్ట్రీని సరిగ్గా అర్థం చేసుకోవడంలో అతను విఫలమయ్యాడన్నారు. మనుషులను అర్థం చేసుకున్నంత ఈజీగా ఇండస్ట్రీని అతను అర్థం చేసుకోలేకపోయాడని తెలిపారు. ఇక ఉదయ్ కిరణ్ మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండేది కాదని, అతని అన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తేజ వివరించారు.ఉదయ్ కిరణ్ ఎప్పుడూ మానసిక సమస్యలు, డిప్రెషన్‌తో బాధపడేవాడని తేజ అన్నారు. ఔనన్నా కాదన్నా సినిమాకు ముందే ఉదయ్ కిరణ్ ఓసారి ఆత్మహత్యకు యత్నించాడని తేజ చెప్పారు. అయితే ఆ తరువాత అతనికి కొంత ఊరటనిచ్చేందుకు అతినితో ఒక సినిమా చేశానని తెలిపారు. అయితే ఆ తరువాత ఉదయ్ కిరణ్‌తో సినిమాలు చేసే అవకాశం తనకు రాలేదని తేజ అన్నాడు. ఉదయ్ కిరణ్ మొదటి సినిమా చిత్రంకు తేజ దర్శకత్వం వహించిన విదితమే. త్వరలో తను తన మీద బయటికి కూడా టీ అవుతున్నానని చర్చ జరుగుతుంది.