సెన్సేషన్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి తాజాగా డైరెక్టర్ తేజపై విరుచుకుపడింది. ఆమె అంతలా ఫైర్ అవ్వడానికి కారణమేంటో తెలియడం లేదు గానీ ఆ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది. డైరెక్టర్ తేజను దారుణంగా ఏకిపారేసింది. గతంలోనూ ఓ సారి తేజ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన, రామ్ గోపాల్ వర్మ వంటి వాటిపై ఘాటుగా స్పందించాడు. ఆ సమయంలో తేజ రాసలీలను బయటపెడతానంటూ శ్రీరెడ్డి చేసిన పోస్ట్‌లు కూడా బాగానే వైరల్ అయ్యాయి.
మళ్లీ ఇన్నాళ్లకి మరోసారి తేజపై శ్రీ రెడ్డి విరుచుకుపడింది. దర్శకుడు తేజా గారికి పెద్ద నమస్కారాలు.. మీరు బాగా అనుభవం ఉన్న డైరెక్టర్.. మేం స్కూల్‌కి వెళ్లే రోజుల్లోనే మీరు డైరెక్షన్ చేశారట. మీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.. మీరు కాంట్రవర్శీ డైరెక్టర్ కూడా.. అమ్మాయిల్ని కొడతారంట. అప్పట్నుంచే మీ మీద నాకు కోపం ఉండేది. అమ్మాయిల్ని కొట్టడం ఏంటి నాన్ సెన్స్ మీ కోపం.. టార్చర్ అదొక ట్రెండ్‌గా అయ్యింది.
ఒకప్పుడు నేను మీకు అభిమానిని.. మీ గురించి చాలా మంచిగా అనుకున్నా. అది వేరే కానీ.. తేజా గారూ!! మీరు యూట్యూబ్‌లో నా గురించి మాట్లాడిన కామెంట్స్ చూశా.. మీకు చాలా గౌరవంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే.. ‘మీరు నాకు అది’ అంటూ దారుణంగా కౌంటర్ ఇచ్చింది. ఇక రామ్ గోవాల్ వర్మ చెప్పుతో కూడా మీరు సమానం కాదంటూ ఘోరంగా అవమానించింది. శ్రీరెడ్డి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తోంది.